Gellu Srinivas Yadav: తెలంగాణ టూరిజం చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా... గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు.
- By Balu J Published Date - 05:22 PM, Tue - 4 April 23

తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు నామినేటేడ్ పోస్ట్ దక్కింది. గత హుజురాబాద్ ఎన్నికల్లో ఆయన ఒడిపోయినప్పటికీ సీఎం కేసీఆర్ సముచిత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేరకు ‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్’ చైర్మన్ గా… గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను నియమించారు. కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. తనకు తగిన గుర్తింపు ఇచ్చిన కేసీఆర్ కు గెల్లు ధన్యావాదాలు తెలియజేశారు.