Food Poison : వర్ధన్నపేట ఎస్టీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది....
- Author : Prasad
Date : 06-09-2022 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్టీ బాలికల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. హాస్టల్ సిబ్బంది బాలికలకు బల్లి పడిన ఆహారం వడ్డించారు. దీంతో 50 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న అడిషినల్ కలెక్టర్ శ్రీవాస్తవ..హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి చేరకుని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు.