Skin Care: సమ్మర్ లో అందంగా మెరిసిపోవాలా…ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!!
సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో ఎండలు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా...
- By Hashtag U Published Date - 03:52 PM, Sun - 3 April 22
సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో ఎండలు తట్టుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా చర్మం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా…ఎండాకాలంలో చర్మ సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే…ఎండాకాలంలోనూ మీ చర్మం అందంగా మెరిసిపోతోంది. అవేంటో చూద్దాం. చలికాలంలో సీరంలు, నూనెలు, క్రీములు ఉపయోగిస్తారు. అయితే ఇవి ఎండాకాలంలో అస్సలు వాడకూడదు. సమ్మర్ సీజన్ లో ఇలాంటి ప్రొడక్టులు వాడకూడదట. చలికాలంలో వాడే ఉత్పత్తులు…ఈ సీజన్ కు సెట్ కావు.
సమ్మర్ లో చర్మాన్ని మెరుగుపరచడానికి పాటించాల్సిన రూల్స్ ఇవే.
చర్మన్ని శుభ్రపరచడం…
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు తొలిమెట్టు మీ చర్మాన్ని శుభ్రపరచడం ద్వారా మురికి, ధూళిని తొలగించవచ్చు. అంతేకాదు..ముఖంపై ఉన్న నూనెను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. మీ స్కిన్ కు సరిపోయే తేలికపాటి, ఆల్కాహాల్ లేని ఫేస్ వాష్ ను ఉపయోగించడం మంచిది. రోజుకు రెండు నుంచి మూడు సార్లు మీ చర్మాన్ని శుభ్రం చేయండి.
ఎక్స్ ఫోలియేట్ చేయండి…
చలికాలంలో చర్మం డ్రైగా, డల్ గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలుసు. పొడి, డెడ్ స్కిన్ ను తొలగించడానికి ఎక్స్ ఫోలియేట్ చేయడం మంచిది. ఇలా చేస్తే మీ చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ప్రకాశవంతంగా ఉంచడానికి వారానికి రెండు సార్లు సున్నితమైన ఎక్స్ ఫోలియేటింగ్ స్క్రబ్ ను ఉపయోగించడం మంచిది.
మాయిశ్చరైజర్ ను మార్చుకోవాలి…
మాయిశ్చరైజర్ ను హెవీ క్రీమ్ లేదా ఆయిల్ నుంచి తేలికైన, వాటర్ లాంటివి సెలక్ట్ చేసుకోవాలి. వాతావరణం వేడెక్కినప్పుడు ముఖం ఎక్కువ వాటర్ ను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి ఆధారిత ఉత్పత్తులను సెలక్ట్ చేసుకోవడం అవసరం. మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం వల్ల మీ చర్మాన్ని సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.
విటమిన్ సి ఫేస్ సీరమ్…
విటమిన్ సి ఆధారిత ఫేస్ సీరమ్ లు ఉపయోగించడం మంచిది. మాయిశ్చరైజర్ సన్ స్క్రిన్ మధ్య, అదనపు చర్మ రక్షణగా సీరంను ఉపయోగించడం మంచిది. హైపర్ పిగ్మెంటేషన్, ఫైన్ లైన్స్ , మచ్చలను వదలించుకోవడానికి కొన్ని చుక్కల ఫేస్ సీరంను ఉపయోగించవచ్చు.
హైడ్రేటెడ్ గా ఉండటం…
ఎండాకాలంలో మంచినీరు ఎక్కువగా తాగాలి. నీరు ఎక్కువగా తాగినట్లయితే..చర్మం కూడా అందంగా మెరుస్తుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ ధరించడం ముఖ్యం. గొడుగు లేదా వెడల్పు అంచులున్న టోపీని ధరించడం మర్చిపోవద్దు. ఇవి మీ చర్మాన్ని సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. వీలైనంత వరకు మీ చర్మాన్ని కప్పి ఉంచే దుస్తువులను ధరించడం మంచిది.
Cover Photo: Instagram
Related News
Hair Care : వేసవిలో ఈ 3 తప్పులు చేయకండి.. మీ జుట్టు నిర్జీవంగా మారుతుంది.!
ప్రతి ఒక్కరూ తమ జుట్టు పొడవుగా మరియు ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు.