Journalists: మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థికసాయం: అల్లం నారాయణ
- By Balu J Published Date - 04:52 PM, Thu - 17 August 23

జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారి ద్వారా ధ్రువీకరించి పంపాలి. దరఖాస్తుతోపాటు జర్నలిస్టు మరణ ద్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ ధ్రువీకరణ పత్రం, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలు ఉండాలని అన్నారు.
ప్రమాదం బారిన పడిన జర్నలిస్టు లేదా అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు కూడా ఆర్థిక సహాయార్థం దరఖాస్తు చేసుకోవాలని, ఈ దరఖాస్తుతోపాటు ప్రభుత్వ సివిల్ సర్జన్ డాక్టరు ఇచిన “జర్నలిస్టు పని చేసే స్థితిలో లేడు (INCAPACITATION)” అనే సర్టిఫికేట్, ఆదాయ ధ్రువీకరణ, జర్నలిస్టు గుర్తింపు కార్డు తదితర వివరాలతో జిల్లా పౌర సంబంధాల అధికారి ధ్రువీకరణతో పంపాలి. ఇప్పటికే దరఖాస్తులు సమర్పించిన వారు మళ్ళీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని మీడియా అకాడమి చైర్మన్ తెలిపారు.
ఇప్పటికే మీడియా అకాడమీ నుండి లబ్ది పొందిన వారు, పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తులు ఇవ్వని వారు మాత్రమే తమ దరఖాస్తులను ఆగస్టు నెల 21వ తేదీలోపు కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, ఇంటి.నెం.10-2-1, యఫ్.డ్.సి.కాంప్లెక్సు, 2వ అంతస్థు, సమాచార భవన్, మాసబ్ టాంక్, హైదరాబాదు – 500028 లో అందజేయాలి. అందిన దరఖాస్తులను జర్నలిస్టు సంక్షేమ నిధి కమిటీ పరిశీలించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. ఇతర వివరాలకు కార్యాలయ అధికారి మొబైల్ నెంబర్ 7702526489 ను సంప్రదించగలరని ఆయన తెలిపారు.
Also Read: Divorce Issues: వివాహ ఖర్చు ఎక్కువైతే ‘విడాకులే’ అమెరికా సర్వేలో సంచలన విషయాలు