BJP MP: బీజేపీ ఎంపీ ఇంటి ముందు రైతులు నిరసన
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు రైతుల నిరసన సెగ తగిలింది.
- By Hashtag U Published Date - 11:17 AM, Tue - 12 April 22

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు రైతుల నిరసన సెగ తగిలింది. ఆయన ఇంటి ముందు రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇంటి ముందు వరి ధాన్యం కుప్పలు పోసి నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం విఫలమైందని రైతులు ఆరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఆయన ఇంటి ప్రధాన గేటు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు తెలిపారు. రైతుల నిరసన గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాంగణంలోకి చేరుకున్నారు.