Facebook Down: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సర్వీసులు డౌన్.. కారణమిదేనా, జుకర్‌బర్గ్ స్పందన ఇదే..!
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మంగళవారం రాత్రి (5 ఫిబ్రవరి 2024) అకస్మాత్తుగా డౌన్ (Facebook Down) అయ్యాయి.
- Author : Gopichand
Date : 05-03-2024 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Facebook Down: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మంగళవారం రాత్రి (5 ఫిబ్రవరి 2024) అకస్మాత్తుగా డౌన్ (Facebook Down) అయ్యాయి. యూజర్ల సోషల్ మీడియా ఖాతాలు అకస్మాత్తుగా లాగ్ అవుట్ అవుతున్నాయి. దీంతో ఏం అవుతుందో తెలియక యూజర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అకస్మాత్తుగా డౌన్ అవుతున్నాయి. ఇటీవల యూట్యూబ్ కూడా ఇదే విధంగా సర్వీసులకు ఆటంకం ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ప్రధాన కారణం యూజర్ల సంఖ్య ఎక్కువ కావటం అని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: Jayaho BC : బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ పార్టీ ఉంది – చంద్రబాబు
చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. Facebook ఆటోమేటిక్‌గా లాగ్ అవుట్ అవుతోంది. చాలా మంది యూజర్లు ఫేస్‌బుక్ లాగిన్ కావటంలో ఇబ్బంది పడుతున్నట్లు ఎక్స్‌లో ట్వీట్‌లు చేస్తున్నారు. సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది DOS దాడి కూడా కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం 8.52 నిమిషాలకు ఫేస్‌బుక్ ఆగిపోయింది. ఇది కాకుండా కొంతమంది వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడంపై ఫిర్యాదులు చేశారు. దీనిపై వినియోగదారులు సోషల్ మీడియాలో నిరంతరం ఫిర్యాదులు చేస్తున్నారు.
People coming to X to check if Facebook down 😛 #facebookdown pic.twitter.com/yPO1fQj9za
— Pawan (@pawankumarindo) March 5, 2024
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు హఠాత్తుగా డౌన్ కావడం వల్ల లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో #facebookdown ట్రెండింగ్‌ను ప్రారంభించారు. వారి ఫిర్యాదులతో పాటు వినియోగదారులు దీనికి సంబంధించి ఫన్నీ రియాక్షన్‌లు కూడా ఇస్తున్నారు. ఫేస్‌బుక్ డౌన్ అయిన తర్వాత ట్విట్టర్‌లో మీమ్స్ వెల్లువెత్తాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా డౌన్ కావడంపై యూజర్లు తమదైన శైలిలో మీమ్స్ వైరల్ చేస్తున్నారు. మెటా కంపెనీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్ కావడం ఇదే మొదటిసారి కాదు. ఫేస్‌బుక్‌లో ప్రజలు మరిన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. మొదటిసారి ఫేస్‌బుక్ తెరిచిన తర్వాత లాగిన్ సాధ్యం కానప్పుడు, వినియోగదారులు తమ ఫోన్‌లను స్విచ్ ఆఫ్, ఆన్ చేయడం ప్రారంభించారు.
We’re now on WhatsApp : Click to Join
జుకర్‌బర్గ్ స్పందన ఇదే
అయితే ఫేస్‌బుక్, ఇన్‌స్టా సర్వీసులు డౌన్ కావడంతో యూజర్లు ఎక్స్‌లో పోస్టులు మొదలుపెట్టారు. ఇదే విషయమై మెటా సీఈవో జుకర్‌బర్గ్ స్పందించారు. మరికాసేపట్లో సర్వీసులు ప్రారంభమవుతాయని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చిల్ గాయ్స్.. మరికాసేపట్లో సమస్య పరిష్కారం అవుతుంది. కాస్త ఓపిక పట్టండి అని జుకర్‌బర్గ్ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.