Kumaraswamy : హాస్పటల్ లో చేరిన కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి
బుధువారం ఉదయం జ్వరం మరింత ఎక్కువ కావడం తో బెంగళూరులోని అపోలో ప్రైవేటు హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారు
- By Sudheer Published Date - 04:55 PM, Wed - 30 August 23
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి (Former CM H D Kumaraswamy) అస్వస్థతతో అపోలో (Apollo) హాస్పటల్ లో చేరారు. రెండు రోజులుగా తీవ్ర జ్వరం (Fever)తో బాధపడుతున్న కుమారస్వామి..బుధువారం ఉదయం జ్వరం మరింత ఎక్కువ కావడం తో బెంగళూరులోని అపోలో ప్రైవేటు హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం డాక్టర్స్ (Doctors ) కుమారస్వామికి చికిత్స అందజేస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హాస్పటల్ వర్గాలు తెలిపాయి.
Read Also : Patnam Mahender Reddy: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం, తొలి ఫైల్ పై సంతకం
కుమారస్వామి గత వారం రోజులుగా వరుస కార్యక్రమాలతో బిజీ బిజీ గా గడుపుతున్నారు. వాస్తవానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ షెడ్యూల్ రద్దు చేసుకున్నారు. ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా చేసుకున్నారు. ఈ తరుణంలో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి పార్టీ వర్గాలు, అభిమానులు , పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు.