HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Even A Chameleon Is Ashamed To See The Congress Party Mlc Kavitha

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: ఎమ్మెల్సీ కవిత

  • Author : Balu J Date : 16-11-2023 - 6:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mlc Kavitha, chandrababu
Mlc Kavitha

MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని స్పష్టం చేశారు. తెలంగాణను పుట్టించిందే సీఎం కేసీఆర్ అని, ఆ తర్వాత రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీని పుట్టించిందే సీఎం కేసీఆర్ అని వివరించారు. నియామకాలపై, ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ వాళ్లు కేసులు వేస్తూ మళ్లీ ఏమీ తెలియనట్టు నంగనాచిలా గ్రామాల్లోకి వచ్చి సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తారని ధ్వజమెత్తారు.

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కవిత వెల్లుల్ల గ్రామంలో, ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ… “ఎన్నికలప్పుడే రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వస్తారు. అందుకే ఆయనకు నేను ఎలక్షన్ గాంధీ అని పేరు పెట్టాను. ఆయన హిందీలో మొహబ్బత్ కా దుకాణ్ (ప్రేమను పంచుతాం) అని హిందీలో అంటే… ఇక్కడ హిందీ రాని రేటెంత రేవంత్ రెడ్డి రాహుల్ దుకాణ్ అంటున్నారని దుకాణం తెరిచి సీట్లన్ని అమ్ముకున్నారు. ” అని వ్యాఖ్యానించారు.

వచ్చేది సీఎం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ బీజేపీ గెలిచినా లాభం లేదని, బీజేపీ అభ్యర్థి గెలిచినా ఒంటి కొమ్ము సొంటికాయలా ఉంటారు కానీ అధికారంలోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీతో ఒక అణాపైసా లాభం జరిగిందా అని ప్రశ్నించారు. 50 ఏళ్లుకుపైగా రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని, మహిళలకు బీడీల గతి పట్టించిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. వాట్సప్ లో వచ్చే మెసేజీలను నమ్మవద్దని యువతకు సూచించారు. తెలంగాణ హక్కల కోసం నిరంతరం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.

మంచి రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. 1969లో తెలంగాణ కావాలని అడిగితే 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చిచంపిందని, 2009 సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ చచ్చినట్టు ఇచ్చిందని వివరించారు. మనల్ని కష్టపెట్టిన వారికి ఓటేస్తే మోసపోతామని అన్నారు.

కేసీఆర్ బీమా పథకాన్ని బీజేపీ నాయకులు అవహేళన చేస్తున్నారని, అటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. మంచి చేస్తున్నవాళ్లను కాదని ఇతరుల వైపు చూడవద్దని కోరారు. సీఎం కేసీఆర్ కంటే గొప్పగా ఆలోచన చేసేవారు, పనిచేసేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. రైతులను అవమానించే రేవంత్ రెడ్డి రైతుల గురించి ఏం ఆలోచన చేస్తారు ? అని అడిగారు. ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి అంటున్నారని, ధరణి తీసేస్తే రైతు బంధు రాదని, ధాన్యం కొనుగోలు డబ్బులూ రావని స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hard comments
  • hyderabad
  • MLC Kavitha
  • rahul gandhi

Related News

Aprilia Rs457

హైదరాబాద్‌లో అప్రిలియా RS457 ట్రాక్ డే

ఈ ట్రాక్ డే కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అప్రిలియా యొక్క సరికొత్త శ్రేణి వాహనాల ప్రదర్శనకు వేదికైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు, కాబోయే రైడర్లను ఒకచోట చేర్చి అప్రిలియా RS457 మరియు టువోనో 457 వంటి మోడళ్లను క్లోజ్-అప్‌గా వీక్షించే అవకాశం కల్పించారు.

  • Fire Breaks Out At Hyderaba

    నాంపల్లి అగ్ని ప్రమాద ఘటన పై అనుమానాలు ?

  • Nampally, Fire Accident

    నాంపల్లిలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఫైల్స్ దగ్దం

  • vande bharat trains bomb threat

    వందే భారత్ ట్రైన్ కు బాంబు బెదిరింపు..

  • Avpn Health Impact Leadersh

    హైదరాబాద్‌లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్‌షిప్ ఫోరం

Latest News

  • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd