Viral video: సూపర్ వీడియో గురు.. పానీ పూరి తింటున్న ఏనుగు?
పానీ పూరి.. ఈ ఆహార పదార్థాన్ని ఇష్టపడని వారు ఉండరేమో. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి
- By Anshu Published Date - 06:05 PM, Fri - 14 October 22

పానీ పూరి.. ఈ ఆహార పదార్థాన్ని ఇష్టపడని వారు ఉండరేమో. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి ఈ పానీ పూరి ని తింటూ ఉంటారు. రోడ్డు పై అలా వెళ్ళినప్పుడు పానీ పూరి సెంటర్ల వద్ద అయితే పదుల సంఖ్యలో గుమ్మగుడి ఈ పానీపూరిని ఎంతో ఇష్టంతో తింటూ ఉంటారు. ఆ పానీ పూరీలో కొంచెం ఉల్లిపాయ వేసుకొని తింటూ ఉంటే పక్కన వెళ్లేవారు కూడా నోరు ఊరుతూ ఉంటుంది. అయితే ఈ పానీపూరి తినడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని తెలిసి కూడా జనాలు మాత్రం వాటిని ఇష్టపడి తింటూ ఉంటారు.
మరికొందరు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మరి తింటూ ఉంటారు. అయితే పానీపూరి నీ కేవలం మనుషులే కాదండోయ్ జంతువులు కూడా తింటాయి అని నిరూపించింది ఒక ఏనుగు. పానీపూరిని ఏనుగు తినడం ఏంటా అని అనుకుంటున్నారా! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. ఒక ఏనుగు పానీపూరి బండి పక్కన నిలబడి తొండంతో పానీపూరిలను తింటోంది.
పానీ పూరి అనే వ్యక్తి కూడా ఆ ఏనుగుని ఏమీ అనకుండా దాని తొండానికి పానీ వేసి ఇస్తుండగా అది కూడా ఎంతో బాగా ఉంది అనుకొని బాగా ఆరగించేస్తోంది. అయితే అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఒక ఏనుగు పానీ పూరి తినడం అన్నది నిజంగా ఒక వింత అని చెప్పవచ్చు. ఆ వీడియో ని చూసిన నెటిజన్స్ నవ్వుకుంటూ ఆ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు.