Governor Tamilisai: గవర్నర్ తమిళిసై ఎక్స్ అకౌంట్ హ్యాక్..!
గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా హ్యాక్ చేశారు హ్యాకర్స్. పాస్ వర్డ్ మార్చేసి సంబంధం లేని పోస్ట్‌లు పెట్టడంతో ట్విట్టర్ గవర్నర్ కు మెయిల్ పంపించింది. దీంతో ఆమె హ్యాండిల్ చేసే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు స్పష్టమైంది.
- By Praveen Aluthuru Published Date - 03:06 PM, Wed - 17 January 24
Governor Tamilisai: గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ చేశారు హ్యాకర్స్. పాస్ వర్డ్ మార్చేసి సంబంధం లేని పోస్ట్‌లు పెట్టడంతో ట్విట్టర్ గవర్నర్ కు మెయిల్ పంపించింది. దీంతో ఆమె హ్యాండిల్ చేసే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు స్పష్టమైంది. దీంతో రాజ్ భవన్ అధికారులు సెబర్ పోలీసులకు కంప్లైట్ చేశారు.
ఇటీవల కాలంలో హ్యాకర్స్ పొలిటికల్, సినిమా, బిజినెస్ వ్యక్తులకు సంబందించిన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ పేరుతో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి హల్చల్ చేశారు. ఇదివరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్ అయిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రధమ పౌరురాలి సోషల్ మీడియా అకౌంట్ని హ్యాక్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ యంత్రంగా సీరియస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటుంది.
Also Read: Hanu Man Affect: హనుమాన్ సినిమా ఎఫెక్ట్: హీరో తేజ కొత్త చిత్రం