Hanu Man Affect: హనుమాన్ సినిమా ఎఫెక్ట్: హీరో తేజ కొత్త చిత్రం
సంక్రాంతికి విడుదలైన సినిమాలలో హీరో తేజ నటించిన హనుమాన్ చిత్రం ఒకటి. గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ లాంటి బడా చిత్రాల మధ్య విడుదలై సెన్సేషన్ విజయం అందుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా, ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు
- By Praveen Aluthuru Published Date - 02:51 PM, Wed - 17 January 24
Hanu Man Affect: సంక్రాంతికి విడుదలైన సినిమాలలో హీరో తేజ నటించిన హనుమాన్ చిత్రం ఒకటి. గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ లాంటి బడా చిత్రాల మధ్య విడుదలై సెన్సేషన్ విజయం అందుకుంది. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించగా, ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా ప్రారంభమైంది.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాకు ఉన్నంత క్రేజ్ ఉంది. సంక్రాంతి సందర్భంగా గత శుక్రవారం హనుమాన్ థియేటర్లోకి రిలీజైంది. పాన్ ఇండియా మూవీగా రిలీజైన హనుమాన్ మూవీకి సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువ క్రేజ్ ఉండడం విశేషం. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ ఆసక్తిగా ఉండడం.. తెలుగు సినిమాలకు బాలీవుడ్ లో క్రేజ్ ఉండడం కారణంగా హనుమాన్ మూవీకి భారీగా క్రేజ్ వచ్చింది.
ఈ మూవీకి ఉన్న క్రేజ్ కు తగ్గట్టుగానే హనుమాన్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అయితే.. హనుమాన్ తర్వాత తేజ సజ్జ ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్, దుల్కర్ సల్మాన్ తో కలిసి తేజ సజ్జ నటిస్తుండడం విశేషం. ఈ సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. తాజా వార్త ఏంటంటే.. తేజ సజ్జ మరో సినిమాకి ఓకే చెప్పాడట.
ఇంతకీ ఎవరితో అంటే.. నక్కిన త్రినాధరావుతో అని సమాచారం. ఈ చిత్రానికి రైటర్ బెజవాడ ప్రసన్నకుమార్ కథ అందించగా, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని రాజేష్ దండా నిర్మించనున్నారు. ఇటీవలే రాజేష్ దండా శ్రీవిష్ణుతో సామజవరగమన అనే చిత్రాన్ని నిర్మించి సక్సెస్ సాధించాడు. కథ రెడీ అయ్యిందట. ఇది నక్కిన స్టైల్ లో సాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ అని తెలిసింది. ఈ సినిమాను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. హనుమాన్ మూవీతో తేజ సజ్జకు డిమాండ్ పెరిగింది. మరి.. నెక్ట్స్ మూవీస్ తో కూడా మెప్పిస్తే.. మరింత క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయం.
Also Read: Manipur Violence : బాంబులతో చెలరేగిన తీవ్రవాదులు.. పోలీస్ కమాండో మృతి
Related News
Teja Sajja : పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..?
పూరీజగన్నాధ్ దర్శకత్వంలో తేజ సజ్జ సినిమా చేయబోతున్నారా..? ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన..