Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సింగ్ కు ఈడీ నోటీస్!
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కు ఈడీ నోటీసులు జారీ చేసింది.
- Author : Balu J
Date : 16-12-2022 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ (Tollwood) డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) కు ఈడీ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ఈనెల 19న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. గతేడాది బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు నైజీరియన్‌ను అరెస్ట్ చేశారు. నైజీరియన్ అరెస్ట్‌తో ఈ కేసుకు సంబంధించిన పలు లింకులు బయటపడ్డాయి. పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు తేలిన క్రమంలో ఈ కేసులో విచారణ చేపడుతోంది. కాగా మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) పైలట్ రోహిత్‌రెడ్డికి నోటీస్ జారీ చేసింది ఈడీ. 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది.
ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణలో చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో, మరోవైపు డ్రగ్స్ కేసు (Drug Case) తెరపైకి రావడంతో ఇటు టాలీవుడ్, అటు పొలిటికల్ సర్కిల్ లో ఈ న్యూస్ ఆసక్తిని రేపుతోంది. ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డ్రగ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రి కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని, ఆయన రక్త నమూనాలను ఇస్తే నిరూపించేందుకు సిద్ధమని కామెంట్స్ చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) డ్రగ్స్ కేసు ప్రస్తావన తెచ్చిన నేపథ్యంలో ఈడీ రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు జారీ చేయడం మరింత సంచలనం రేపుతోంది. ప్రస్తుతం ఇండియన్2 సినిమాలో షూటింగ్ ఉందనీ, ఇంకా నోటీసులు అందలేదని తెలుస్తోంది.
Also Read: Mass Megastar: మెగా బ్లాస్టింగ్ కు ‘వాల్తేరు వీరయ్య’ రెడీ!