Pemmasani Chandrasekhar: గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఈసీ నోటీసులు
గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్‌సీపీ నేతలను సద్దాం హుస్సేన్‌తో పోల్చారు.
- By Praveen Aluthuru Published Date - 05:51 PM, Sat - 30 March 24

Pemmasani Chandrasekhar: గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం గంగరాజు నోటీసు పంపారు. మార్చి 25న నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో పెమ్మసాని వైఎస్సార్‌సీపీ నేతలను సద్దాం హుస్సేన్‌తో పోల్చారు.
We’re now on WhatsApp : Click to Join
‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు సద్దాం హుస్సేన్‌లా ప్రవర్తిస్తున్నారు. సద్దాం హుస్సేన్ కూడా నిరంకుశంగా ప్రవర్తించాడు. అందుకే అతనిని బయటకు లాగి కుక్కలా నిర్దాక్షిణ్యంగా చంపారు, అని పెమ్మసాని అన్నారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఈసీకి ఫిర్యాదు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగుల్‌మీరా తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
Also Read: Throat Pain: గొంతు నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి?