Earthquake: ఇండోనేషియాలో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9 తీవ్రతగా నమోదు
ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో గురువారం (ఏప్రిల్ 13) 4.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అందించింది.
- By Gopichand Published Date - 09:21 AM, Thu - 13 April 23

ఇండోనేషియాలోని తనింబర్ దీవుల్లో గురువారం (ఏప్రిల్ 13) 4.9 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) అందించింది. ఇండోనేషియా ప్రాంతంలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున 4:37 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం లోతు 70.2 కి.మీ. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
వారం రోజుల క్రితం భూకంపం
తనింబర్ ద్వీపంలో భూకంపం రావడానికి ముందే పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఏప్రిల్ 3 న భూకంపం వచ్చింది. సుమత్రా ద్వీపంలో భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) నివేదిక ప్రకారం.. భూకంప కేంద్రం ఉత్తర సుమత్రాలోని పడాంగ్ సిడెంపువాన్ నగరానికి నైరుతి సముద్రంలో 84 కిలోమీటర్ల లోతులో ఉంది. సుమత్రా దీవిలో రాత్రి 10 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఇందులో కూడా ఎలాంటి నష్టం జరగలేదు.
Also Read: Nepal Car Accident: నేపాల్‌లో నలుగురు భారతీయుల దుర్మరణం.. కారు లోయలో పడడంతో ప్రమాదం
తనింబర్ ఐస్‌లాండ్‌లో రెండు నెలల క్రితం భూకంపం
ఫిబ్రవరి నెలలో కూడా ఇండోనేషియాలోని తనింబర్ ద్వీపంలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపం వల్ల ఎలాంటి సునామీ వచ్చే ప్రమాదం లేదని నివేదికలో పేర్కొంది. మలుకు రాజధాని అంబన్‌కు ఆగ్నేయంగా 543 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఇండోనేషియా చుట్టూ “పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్” ఉంది. ఇది భూకంపాలకు చాలా సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్ భూమి కింద కనిపిస్తుంది. దీని కారణంగా భూకంపాలు తలెత్తుతాయి.