Earthquake: జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం తూర్పు కత్రా నుండి 97 కి.మీ దూరంలో సంభవించింది.
- Author : Gopichand
Date : 17-02-2023 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. భూకంపం తూర్పు కత్రా నుండి 97 కి.మీ దూరంలో సంభవించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు భూకంపం సంభవించింది. నెల రోజుల క్రితం దోడా, కిష్త్వార్‌లలో భూకంపం సంభవించింది. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Gold And Silver Price Today: పసిడి ప్రియులకి గుడ్ న్యూస్.. బంగారం కొనాలనుకుంటే ఈరోజే కొనండి..!
అంతకుముందు ఫిబ్రవరి 13న సిక్కిం రాష్ట్రంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, సిక్కింలోని యుక్సోమ్‌లో తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది.
An earthquake with a magnitude of 3.6 on the Richter Scale hit 97 km East of Katra, Jammu and Kashmir, today at 5:01 am IST: National Centre for Seismology pic.twitter.com/Gmv0giTHpx
— ANI (@ANI) February 17, 2023