HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Droupadi Murmu Aiims Mangalagiri Convocation Telangana Visit

Droupadi Murmu : నేడు మంగళగిరికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu : మంగళగిరి ఎయిమ్స్‌లో మొదటి స్నాతకోత్సవం ఇవాళ ఘనంగా జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానుండటంతో, ఎయిమ్స్‌ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టంగా నిర్వహించారు.

  • By Kavya Krishna Published Date - 10:55 AM, Tue - 17 December 24
  • daily-hunt
Droupadi Murmu
Droupadi Murmu

Droupadi Murmu : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు (మంగళవారం) మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ సీఈఓ డాక్టర్ మధుబానంద కర్ మీడియాతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ , వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.

స్నాతకోత్సవం మంగళగిరి ఎయిమ్స్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందజేసి, స్నాతకోత్సవ ప్రసంగం చేస్తారు. మొత్తం 49 ఎంబీబీఎస్ విద్యార్థులు, నలుగురు పీహెచ్‌డీ సర్టిఫికేట్ కోర్సు విద్యార్థులు ఈ కార్యక్రమంలో డిగ్రీలను స్వీకరిస్తారు.

తెలంగాణ పర్యటన వివరాలు:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 18న తెలంగాణ పర్యటన ప్రారంభిస్తారు. ఈ సమయంలో ఆమె సికింద్రాబాద్‌లోని రాష్టప్రతి నిలయం, బొలారంలో ఆతిథ్యం పొందనున్నారు. డిసెంబర్ 18న రాష్టప్రతి నిలయంలో వివిధ పథకాల ప్రారంభోత్సవాలు , భూమి పూజ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

సికింద్రాబాద్ డిఫెన్స్ కాలేజీ కార్యక్రమం:

డిసెంబర్ 20న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌కు ‘రాష్ట్రపతి కళర్స్’ అందజేస్తారు. అదే సాయంత్రం రాష్టప్రతి నిలయంలో అట హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రముఖులు, గౌరవనీయ వ్యక్తులు పాల్గొంటారు.

రాష్ట్రపతి మంగళగిరి పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌కు సంబంధించి ప్రత్యేక ఆంక్షలు విధించబడినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలిపారు. ఈరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.

1. చెన్నై నుంచి వైజాగ్ వైపుకు వెళ్లే వాహనాలు : గుంటూరు బుడంపాడు మీదుగా అవనిగడ్డ-పామర్రు-గుడివాడ-హనుమాన్‌ జంక్షన్‌ వైపు మళ్లించారు.
2. వైజాగ్ నుంచి ఏలూరు, విజయవాడ, చెన్నై వైపు వెళ్లే వాహనాలు : హనుమాన్‌ జంక్షన్‌-గుడివాడ-పామర్రు-అవనిగడ్డ మీదుగా మళ్లించారు.
3. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్ళే వాహనాలు : తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మీదుగా వెళ్లాలని సూచించారు.
వాహనదారులు ఈ మార్గాల హెచ్చరికలను గమనించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Rajat Patidar : ఆర్సీబీ కెప్టెన్ గా ర‌జిత్ పాటిదార్ ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abdul Nazeer
  • AIIMS Mangalagiri
  • andhra pradesh
  • chandrababu naidu
  • Droupadi Murmu
  • Guntur SP Gangadhara Rao
  • nara lokesh
  • Prataprao Jadav
  • rashtrapati nilayam
  • Telangana visit
  • traffic restrictions

Related News

AP Assembly monsoon session to begin from 18th of this month

AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా చర్యలు, ప్రజలకు చెందిన ప్రధాన సమస్యలు, విధానాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయపరంగా కీలకంగా మారనున్నాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • Cm Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd