HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Do You Know How Important Vermilion Is In Indian Culture History And Medicine

Sindoor : సిందూరానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుసా ?

సిందూరం(Sindoor) అంటే భారత్‌లో ఒక సాధారణ సామగ్రి మాత్రమే కాదు. అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పదార్థం.

  • By Pasha Published Date - 08:44 AM, Thu - 8 May 25
  • daily-hunt
Sindoor Operation Sindoor Vermilion Indian Culture History Medicine

Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయింది. తొమ్మిది పాక్ ఉగ్రవాద స్థావరాలను భారత సేనలు మే 7న(బుధవారం) విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఈ ఆపరేషన్‌‌కు ‘సిందూర్’ అనే పేరును స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సూచించారని తెలుస్తోంది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులు మహిళలను వదిలేసి.. పురుషులను మాత్రమే చంపారు. ఆ దాడిలో చనిపోయిన 26 మంది కూడా పురుషులే.  ‘‘మోడీకి వెళ్లి చెప్పుకోండి’’ అని బాధిత మహిళలకు ఉగ్రవాదులు చెప్పారట. ఈ దారుణ ఘటనలో ఎంతోమంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు.  సిందూరానికి దూరమయ్యారు. భర్తలను కోల్పోయిన, సిందూర భాగ్యానికి దూరమైన బాధిత మహిళల ఎమోషన్ నుంచే ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరును ప్రధాని మోడీ వెలికితీశారని అంటున్నారు. మొత్తం మీద ఈ పేరు దేశ ప్రజల మనసులను, ఎమోషన్స్‌ను టచ్ చేసింది. అయితే సిందూరానికి మన దేశ కల్చర్, హిస్టరీ, వైద్యంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం..

Also Read :Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9

సిందూరం ప్రాధాన్యత, చరిత్ర ఇదీ.. 

  • సిందూరం(Sindoor) అంటే భారత్‌లో ఒక సాధారణ సామగ్రి మాత్రమే కాదు. అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన పదార్థం.
  • తమ భర్తల యోగ క్షేమాలను కోరుకుంటూ వివాహిత మహిళలు నుదుటిపై సిందూరాన్ని ధరిస్తారు.
  • సిందూరం మహిళల్లో రక్త ప్రసరణ ప్రక్రియ చురుగ్గా జరగడానికి దోహదం చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.
  • నుదుటిపై ఆజ్ఞా చక్రం అనే నాడీ మండల కేంద్రం ఉంటుంది. సరిగ్గా దాని ప్రాంతంలోనే సిందూరాన్ని దిద్దుతారు. దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. భావోద్వేగాలు, శారీరక వాంఛలు కంట్రోల్‌లో ఉంటాయి.
  • మానవ శరీరంలో చక్రస్థానాలు ఉంటాయని చాలామంది నమ్ముతారు. సిందూరం అనేది ఒక మహిళ మానసిక శక్తినంతటినీ తన భర్తపై నిలిపి ఉంచేలా చేస్తుందని పెద్దలు అంటారు.
  • భారత్‌లో 5వేల ఏళ్ల కిందటి నుంచే మహిళలు సిందూరం పెట్టుకుంటున్నారు. హరప్పా, మొహంజోదారో కాలం నుంచే సిందూరాన్ని భారతీయ వనితలు అలంకరణకు వాడుతున్నారు.
  • ఐదు వేల సంవత్సరాలకు పూర్వం సింధూ నాగరికత కాలంలోనూ మహిళలు నుదుటన సిందూరం పెట్టుకునే వారట. దీనికి ఆధారంగా కొన్ని పురావస్తు సాక్ష్యాలు లభించాయి. హరప్పా ప్రాంతంలో లభించిన అమ్మతల్లి విగ్రహాల నుదుటన ఎర్రటి సిందూరం ఉన్నట్లు పురావస్తు పరిశోధకులు గుర్తించారు.
  • పవిత్రమైన భారతీయ పురాణాల్లోనూ సిందూరం ప్రస్తావన ఉంది.
  • సీతామాత నుదుటిపై సిందూరం ధరించేవారని రామాయణంలో పేర్కొన్నారు. నుదుటిపై సిందూరంతో సీతామాతను చూశానని హనుమంతుడు చెప్పినట్టుగా రామాయణంలో ప్రస్తావన ఉంది.
  • పార్వతీ మాత, లక్ష్మీదేవి కూడా నుదుటిపై సిందూరం పెట్టుకునేవారని పురాణాల్లో ఉంది.
  • సిందూరం అనేది ఎరుపు వర్ణంలోనే కాదు, కొన్ని ప్రాంతాల్లో నారింజ రంగులోనూ ఉంటుంది.
  • ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లోని పూర్వాంచల్‌ ప్రాంతంలో మహిళలు నారింజ రంగు సిందూరం ధరిస్తారు.
  • సిందూరానికి కేంద్ర ప్రభుత్వం 2017లో పన్ను మినహాయింపు కల్పించింది. సిందూరం, బొట్టు, గాజులను అత్యావశ్యకాలుగా పరిగణించి వాటిని జీఎస్టీ నుంచి మినహాయించింది.

Also Read :Loitering Munition: ఆపరేషన్ సిందూర్‌లో లోయిటరింగ్ మ్యూనిషన్‌దే కీ రోల్‌.. అస‌లేంటీ ఈ లోయిటరింగ్ మ్యూనిషన్?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • Indian culture
  • Indian history
  • Indian Medicine
  • Operation Sindoor
  • Sindoor
  • Vermilion

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

  • Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

  • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd