Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9
ఈ సమాచారం ఆధారంగానే HQ-9 గగనతల రక్షణ వ్యవస్థను 1980వ దశకంలో చైనా(Pakistan Fail) తయారు చేసింది.
- By Pasha Published Date - 08:57 PM, Wed - 7 May 25

Pakistan Fail : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ అయింది. ఈ ఆపరేషన్ వేళ ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వీక్‌గా ఉంది. బుధవారం రోజు ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత్ ప్రయోగించిన మిస్సైళ్లను, డ్రోన్లను పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోయింది. ఇది పాకిస్తాన్ పెద్ద ఫెయిల్యూర్. ఇంతకీ పాకిస్తాన్ HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ ఎందుకు ఫెయిలైంది ? చైనా వల్లేనా ? ఈ కథనంలో చూద్దాం..
Also Read :Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై ప్రెస్‌మీట్.. వ్యోమిక, సోఫియా నేపథ్యమిదీ
అమెరికాను కాపీ కొట్టి.. HQ-9 తయారు చేసిన చైనా
చైనా అనేది అన్ని రంగాల టెక్నాలజీకి హబ్. అయితే ఆ దేశం వాడేది సొంత టెక్నాలజీని కాదు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్వీడన్, జపాన్ లాంటి దేశాల నుంచి కాపీ కొట్టిన టెక్నాలజీ. ఆయుధాలు తయారు చేసే రంగంలోనూ చైనా కాపీ కొట్టే టెక్నిక్‌నే పాటిస్తోంది. చైనా ఈవిధంగానే చాలా ఆయుధాలను తయారు చేసుకుంది. ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్తాన్‌లో ఫెయిలైన్ HQ-9 గగనతల రక్షణ వ్యవస్థను తయారు చేసింది మరెవరో కాదు. చైనాయే. ఒక థర్డ్ పార్టీ దేశం నుంచి అమెరికాకు చెందిన పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ సమాచారాన్ని చైనా సేకరించింది. ఈ సమాచారం ఆధారంగానే HQ-9 గగనతల రక్షణ వ్యవస్థను 1980వ దశకంలో చైనా(Pakistan Fail) తయారు చేసింది. HQ-9 అంటే హాంగ్ క్వీ- 9 అని అర్థం. చైనాకు చెందిన CPMIEC (చైనా ప్రెసిషన్ మెషినరీ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్) సంస్థ దీన్ని తయారు చేసింది.
Also Read :Masood Azhar: ‘ఆపరేషన్ సిందూర్’తో వణికిపోయిన మసూద్ అజార్ ఎవరు ?
భారత్ మిస్సైళ్లు, డ్రోన్లు వెళ్లినా.. సైలెంట్‌గా HQ-9
పాకిస్తాన్ తన సైనిక అవసరాల కోసం 95 శాతం మేర చైనాపైనే ఆధారపడుతోంది. ఈక్రమంలోనే చైనా నుంచి HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్ కొనుగోలు చేసింది. వాటిని భారత సరిహద్దుల్లో మోహరించింది. బుధవారం తెల్లవారుజామున భారత సైన్యం ప్రయోగించిన మిస్సైళ్లు, డ్రోన్లు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించినా.. HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ సైలెంటుగా ఉండిపోయింది. కనీసం అలర్ట్ సైరన్ కూడా మోగించలేదు. అంటే నాసిరకం ఆయుధాలు, యుద్ధ విమానాలు, మిస్సైళ్లు, గగనతల రక్షణ వ్యవస్థలను పాకిస్తాన్‌కు చైనా అంటగడుతోందని అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. HQ-9 గగనతల రక్షణ వ్యవస్థలో చైనా వాడిన టెక్నాలజీ చాలా పాతది. దీనిలో ఉన్న రాడార్ వ్యవస్థ పాతది. అందువల్లే అది భారత మిస్సైళ్లను అది గుర్తించలేకపోయింది. 2022 మార్చి 9న భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తూ పాకిస్తాన్‌లోని మియాన్ చన్ను ప్రాంతంలోకి వెళ్లి పడింది. దీన్ని అప్పట్లో HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ ట్రాక్ చేసింది. కానీ అడ్డుకోలేకపోయింది.