Sleeping Habits: రాత్రిళ్లు ముఖానికి దుప్పటి కప్పుకొని నిద్ర పోతున్నారా.. అయితే ఇది మీకోసమే!
Sleeping Habits: మనలో చాలా మందికి రాత్రి పడుకొనేటప్పుడు బెడ్ షీట్ కప్పుకొని పడుకుంటా ఉంటారు. ముఖ్యంగా ముఖానికి కూడా కప్పేసుకుంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు.
- Author : Anshu
Date : 07-12-2025 - 8:01 IST
Published By : Hashtagu Telugu Desk
Sleeping Habits: అసలే చలికాలం. దుప్పటి లేకుండా పడుకోవడం అన్నది జరగదు. అయితే కొందరు ముఖం కూడా కనిపించకుండా ముఖానికి కూడా దుప్పటి కప్పుకుంటూ ఉంటారు. మరి కొందరు ముఖానికి కాకుండా కేవలం శరీరానికి మాత్రమే దుప్పటి కప్పుకుంటూ ఉంటారు. అయితే దుప్పటిని ముఖానికి మొత్తం కప్పుకొని పడుకోవడం మంచిదా, కాదా, లేక ఆరోగ్యానికి ప్రమాదమా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖానికి దుప్పటి కప్పుకోకపోతే మాకు అసలు నిద్రే పట్టదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇది చాలా కామన్ గా అనిపించవచ్చట.
కానీ దీని వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీరు మీ ముఖం, తలను పూర్తిగా దుప్పటితో కప్పి నిద్రపోయినప్పుడు శరీరానికి తగినంత తాజా గాలి లేదా ఆక్సీజన్ లభించదట. మీరు వదిలే కార్బన్ డయాక్సైడ్ దుప్పటి లోపలే ఆగిపోతుంది. ఫలితంగా అదే కార్బన్ డయాక్సైడ్ అధికంగా పీల్చే అవకాశం ఉంటుందట. దీని వల్ల శరీరంలో ఆక్సీజన్ స్థాయిలను తగ్గిస్తుందని, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను పెంచుతుందని, దాని కారణంగా ఊపిరి ఆడకపోవడం, నిద్రకు ఆటంకం కలగవచ్చని చెబుతున్నారు. దీని వల్ల ఉదయం నిద్ర లేచినప్పుడు చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుందట. దుప్పటి లేదా బెడ్ షీట్ ముఖానికి కప్పుకొని నిద్రపోవడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుందట.
చలికాలంలో రాత్రిపూట నిద్రపోవడానికి శరీరానికి ఉష్ణోగ్రత అవసరమే. కానీ మరీ ఎక్కువ వేడి కారణంగా చెమటలు పట్టేస్తాయని చెబుతున్నారు. నిద్రపోయిన కూడా విశ్రాంతి తీసుకున్న ఫీలింగ్ కలగదట. రెస్ట్ లెస్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. ముఖం మొత్తం దుప్పటితో కవర్ చేయడం వల్ల ఆక్సీజన్ స్థాయి తగ్గడం నిద్రకు ఆటంకం కలిగించడంతో పాటు ఊపిరి ఆడని భావన కలుగుతుందట. మన శరీరానికి, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా అవసరం అను, అందుకే ఈ పొరపాటు చేయకూడదని, రోజూ ఇదే చేయడం వల్ల ఏకాగ్రత తగ్గిపోతుందని చిరాకు పెరుగుతుందని,ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖానికి దుప్పటి కప్పుకోకపోతే నిద్రపోలేం అనే ఫీలింగ్ మీకు ఉంటే ఒక చిన్నా చిట్కా పాటించాలట. పూర్తిగా కప్పుకోకుండా కనీసం సగం అయినా కప్పుకోవాలట. ముఖ్యంగా ముక్కుకు ఊపిరాడకుండా కప్పుకోకూడదని గాలి ఆడేలా దుప్పటి కప్పుకోవాలని చెబుతున్నారు.