HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Dhawal Kulkarni Set To Join Mumbai Indians Camp

IPL Dhawal Kulkarni:ముంబై జట్టులోకి ధవల్ కులకర్ణి

ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్‌ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి సీజన్‌లో పేలవ ప్రదర్శన కొన‌సాగిస్తోంది.

  • Author : Naresh Kumar Date : 21-04-2022 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhawanl Kulkarni Mumbai Indians
Dhawanl Kulkarni Mumbai Indians

ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు టైటిల్‌ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈసారి సీజన్‌లో పేలవ ప్రదర్శన కొన‌సాగిస్తోంది. ఐపీఎల్‌-2022లో ఇప్ప‌టి వ‌ర‌కు విజయం సాధించని ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఆరో మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసి పాయింట్ల ప‌ట్టిక‌లో అఖ‌రి స్థానంలో నిలిచింది. ఇక తన తర్వాతి మ్యాచ్ ను గురువారం చెన్నై సూపర్ కింగ్స్ తో రోహిత్ సేన పోటీపడనుంది. ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. అయితే ప్రస్తుతం వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ గెలుపుబాట పట్టేందుకు తుది జట్టులో పలు మార్పులు చేయాలని భావిస్తోంది.

ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్‌ శర్మ సూచనా మేరకు ముంబైకి చెందిన ధవల్‌ కులకర్ణిని జట్టులోకి తీసుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలో జరుగుతుండటంతో ఇక్కడి పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న కులకర్ణిని ఎలాగైనా జట్టులో చేర్చుకోవాలని రోహిత్ శర్మ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2022 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయిన ధవల్‌ కులకర్ణిని జట్టులోకి తీసుకుంటున్నట్లు సమాచారం.. అలాగే ధవల్‌ కులకర్ణి టీమిండియా తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడి 22 వికెట్లు తీశాడు. ఇక ధవల్‌ కులకర్ణి ఐపీఎల్‌లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు తీశాడు. అలాగే ఈ మెగాటోర్నీలో ముంబై ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dhawal Kulkarni
  • IPL 2022
  • mumbai indians

Related News

Hardik Pandya

ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్ న్యూస్‌!

IPL 2026 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ఒక విజయం, ఒక ఓటమితో ఆరో స్థానంలో ఉంది. వారి నెట్ రన్ రేట్ -0.206గా ఉంది.

  • Delhi Capitals

    ముంబైపై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం!

Latest News

  • Ceasefire : సీజ్‌ఫైర్ ముసుగులో అణు కుట్ర? ఇరాన్ దౌత్య నీతికి అమెరికా బలి?

  • Amaravati : అమరావతికి కేంద్రం భారీ నజరా.. రూ.2,534 కోట్లతో ‘సెంట్రల్ సెక్రటేరియట్’ నిర్మాణం!

  • Tata Intra EV Price in 2026 : టాటా మోటార్స్ నుండి ‘ఇంట్రా EV’ పికప్ విడుదల!

  • Whatsapp: మొబైల్ నంబర్ లేకుండానే చాటింగ్.. వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

  • University of Malaysia : మలేషియా వర్సిటీతో చెన్నైస్ అమృత ఒప్పందం!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd