Delhi Police : పోలీసుల కళ్లుగప్పి బైక్‌లను దొంగిలిస్తున్న కేటుగాడు.. ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు
ఢిల్లీలో పోలీసుల కళ్లుగప్పి బైక్‌లను దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 వాహనాలను
- By Prasad Published Date - 01:35 PM, Mon - 23 January 23

ఢిల్లీలో పోలీసుల కళ్లుగప్పి బైక్‌లను దొంగిలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముదిత్ శర్మ అనే నిందితుడు స్కూటర్‌పై చెక్‌పాయింట్ గుండా వెళుతుండగా, పోలీసులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటనే పట్టుకున్నారు. నిందితుడు తాను నడుపుతున్న స్కూటర్‌కు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. విచారణ అనంతరం ఆ స్కూటర్ అతనిది కాదని.. షాహదారా నుంచి చోరీకి గురైనట్లు తేలింది. అతను గత కొన్ని నెలలుగా ట్రాన్స్-యమునా ప్రాంతంలో స్కూటర్లను దొంగిలిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితుగు వెల్లడించాడు. చోరీకి గురైన 9 స్కూటర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వాహనాల విడిభాగాలను విక్రయించి సొమ్ము చేసుకునేవాడని పోలీసులు తెలిపారు.

Related News

America : అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు.. ఒక్క నెలలో ఆరు సార్లు..!
అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన