Delhi Metro Graffiti: కేజ్రీవాల్ ను చంపేస్తానని మెట్రో స్టేషన్లో రాతలు.. వ్యక్తి అరెస్ట్
దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ సందేశాలు రాసిన 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 22-05-2024 - 2:47 IST
Published By : Hashtagu Telugu Desk
Delhi Metro Graffiti: దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను బెదిరిస్తూ సందేశాలు రాసిన 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బరేలీకి చెందిన అంకిత్ గోయల్‌గా గుర్తించామని, ఢిల్లీ పోలీసుల మెట్రో యూనిట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.
గోయల్ ఉన్నత విద్యావంతుడు మరియు ప్రముఖ బ్యాంకులో పని చేస్తుండటం గమనార్హం. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తెలుస్తుంది. గోయల్ ఇల్లు కొనుగోలు చేసేందుకు బరేలీ నుంచి గ్రేటర్ నోయిడాకు వచ్చి ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేస్తునంట్లు దర్యాప్తులో తేలింది. విశేషం ఏంటంటే గోయల్ మానసిక పరిస్థితి బాగా లేదని పోలీసు వర్గాలు సూచించాయి.
కాగా గోయల్ వెనుక బీజేపీ హస్తం ఉందని ఆప్ ఆరోపించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమి పాలవుతుందన్న మనస్తాపంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆప్ ఎద్దేవా చేసింది. తమ ఓటమి బీజేపీని ఉలిక్కిపడేలా చేసిందని విమర్శించింది ఢిల్లీ అధికార ఆప్ పార్టీ.
Also Read: TS : త్వరలో టీజీఎస్‌ఆర్టీసీగా లోగోలో మార్పులు..ఆర్టీసీ వెల్లడీ