HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Da Hike Announcement Likely In Today Heres What To Expect

DA Hike Announcement: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. నేడు డీఏ పెంపుపై క్లారిటీ..!

నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike Announcement)లో 4 శాతం పెంపునకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

  • By Gopichand Published Date - 08:53 AM, Wed - 18 October 23
  • daily-hunt
Investment Tips
Investment Tips

DA Hike Announcement: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కేంద్ర ఉద్యోగులకు కూడా శుభవార్త రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA Hike Announcement)లో 4 శాతం పెంపునకు ఈ సమావేశంలో ఆమోదం లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే కరువు భత్యం 42 శాతం నుంచి 46 శాతానికి పెరుగుతుంది.

ఈ పెంపు జూలై 1, 2023 నుండి అమల్లోకి వస్తుంది. నవంబర్ నెల జీతం వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు జూలై నుంచి అక్టోబర్‌ వరకు బకాయిలు కూడా అందుతాయి. ఈ ప్రకటన ద్వారా 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA) సంవత్సరానికి రెండుసార్లు పెంచుతున్నారు. ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ ప్రయోజనం పొందుతారు.

Also Read: Gold- Silver Rates: గోల్డ్ కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌.. మరోసారి తగ్గిన ధరలు..!

We’re now on WhatsApp. Click to Join.

జీతంపై 4 శాతం డీఏ పెంపు ప్రభావం ఎలా ఉంటుంది?

కనీస మూల వేతనం రూ.18,000 అనుకుందాం. ప్రస్తుతం ఉన్న 42 శాతం డీఏ ప్రకారం రూ.7,560 పెరుగుతుంది. డీఏను 4 శాతం నుంచి 46 శాతానికి పెంచితే నెలవారీ పెంపు రూ.8,280 అవుతుంది. ఇది కాకుండా ప్రయాణ భత్యంపై కూడా DA అందుబాటులో ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఈ పే స్కేల్‌లోని ఉద్యోగి రూ. 8,640 లాభాన్ని పొందవచ్చు. అదే సమయంలో గరిష్ట వేతన స్కేల్ రూ.56,900 ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం 42 శాతం డీఏ ప్రయోజనాన్ని పొందుతున్నారు. నెలవారీ డియర్‌నెస్ అలవెన్స్ రూ. 23,898. డీఏ 46 శాతం అయితే ఈ మొత్తం రూ.26,174గా అంచనా వేయబడింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • da hike
  • DA Hike Announcement
  • govt employees
  • pm modi

Related News

HDFC Bank

HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. జీతం పొందే, స్వయం ఉపాధి (Self-employed) కస్టమర్ల కోసం హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7.90% నుండి 13.20% వరకు ఉన్నాయి. బ్యాంక్ ఈ రేట్లను RBI పాలసీ రెపో రేటు + 2.4% నుండి 7.7% ఆధారంగా నిర్ణయిస్తుంది.

  • 8th Pay Commission

    8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

  • Harleen Deol Asks PM Modi

    Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

  • PAN- Aadhaar

    PAN- Aadhaar: పాన్ కార్డు ఉన్న‌వారికి బిగ్ అల‌ర్ట్‌.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే ఛాన్స్‌!

  • India Cricket Team

    PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

Latest News

  • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

  • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

  • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

  • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

  • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

Trending News

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd