HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Control Room Set Up For Saudi Bus Accident Victims

Saudi Arabia Tragedy : సౌదీ బస్సు ప్రమాద బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు.!

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.

  • Author : Hashtag U Date : 17-11-2025 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Saudi Arabia Bus Tragedy
Saudi Arabia Bus Tragedy

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.

సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి.. ఏకంగా 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది భారతీయ యాత్రికులేనని.. ఇందులోనూ హైదరాబాద్‌కు చెందినవారు అధికంగా ఉన్నారని ప్రాథమిక సమాచారం అందుతోంది. సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో (సౌదీ కాలమానం ప్రకారం) మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండటం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. దీంతో 42 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లేపల్లి, బజార్‌ఘాట్ ప్రాంతాలకు చెందిన సుమారు 16 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని రెండు ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మృతి చెందిన వారిలోనూ ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఉన్నట్లు తెలిసింది.

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం కావాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు +91 79979 59754, +91 99129 19545 ద్వారా సంప్రదించాలని కోరారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా.. మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో తెలంగాణ వాసులు ఉంటే వారు ఏ ఏజెన్సీ ద్వారా ప్రయాణించారో తెలుసుకునేందుకు హజ్ కమిటీ ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత ఈరోజు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • hyderabad
  • Saudi Arabia
  • Saudi Arabia Tragedy

Related News

CM Revanth Reddy

సీఎం రేవంత్ పాల‌నలో స్థిరత్వం నుంచి స్మార్ట్ డెవలప్మెంట్‌ దిశగా తెలంగాణ‌!

ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడానికి డిజిటల్ వేదికలను, డేటా ఆధారిత వ్యవస్థలను వినియోగిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రయోజనాలు నేరుగా అందుతున్నాయి.

  • Musi River

    మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్

  • CM Revanth Reddy

    ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!

  • KCR's attendance at assembly meetings: Legislative Assembly set to heat up politically..!

    అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!

  • Silver Price

    వెండి వెలుగులు..పెరుగుదలకు ప్రధాన కారణం ఇదేనా..!

Latest News

  • జనవరి 4 న భోగాపురంలో తొలి ఫ్లైట్ ల్యాండింగ్

  • టోల్ మినహాయింపు లేఖ పై కాంగ్రెస్ పై బిఆర్ఎస్ విమర్శలు

  • అసలు పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదేనా ?..దీన్ని ఎవ‌రు తిన‌కూడ‌దు..?

  • బంగ్లా మాజీ ప్రధాని అంత్యక్రియలకు జైశంకర్

  • కొత్త ఏడాదికి వాట్సప్‌ యూజర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు

Trending News

    • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

    • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd