HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Congress To Hold Massive Protest At Ed Office Today

Congress Protest : నేడు ఈడీ కార్యాల‌యాల వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్ట‌నున్న‌ కాంగ్రెస్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచార‌ణ‌కు పిల‌వ‌డంపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు

  • Author : Prasad Date : 20-07-2022 - 7:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచార‌ణ‌కు పిల‌వ‌డంపై కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈడీ విచార‌ణ‌ని ఖండిస్తూ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టనుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం అంజన్‌కుమార్‌ యాదవ్‌, మల్లు రవి, మాజీ మంత్రులు ఎం. శశిధర్‌రెడ్డి, డాక్టర్‌.జె.గీతారెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈడీ కార్యాలయానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచిందని, అనేక నిత్యావసర వస్తువులపై జిఎస్‌టిని విధించిందని తెలిపారు. బీజేపీ దేశాన్ని విభజించి పాలించాలని చూస్తోందని గీతారెడ్డి ఆరోపించారు. బీజేపీ విభజన, విభజించి పాలించే విధానాన్ని ఎదుర్కొనేందుకు తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను వేధించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టిందని, నిరసనకు ముందు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్ వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని టీకాంగ్రెస్ నేతలు తెలిపారు. రాహుల్ గాంధీని ఈడీ ఇప్పటికే చాలా రోజులు విచారించిందని, ఇప్పుడు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించబోతోందని తెలిపారు.

ఈడీ వేధింపులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను వేధిస్తే కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారని, ఇలాంటి చర్యలతో తమ పార్టీ ఎప్పటికీ బలహీనపడదన్నారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేశారని ఎం అంజన్‌కుమార్ యాదవ్ అన్నారు. ఇదే అంశంపై జులై 22న అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈడీ కేసులు పెట్టిందని టీపీసీసీ అధికార ప్ర‌తినిధి మల్లు రవి అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడే రోజునే సోనియా గాంధీని ఈడీ ఇంటరాగేషన్‌కు పిలుస్తోందని చెప్పారు. సోనియా గాంధీ గానీ, రాహుల్ గాంధీ గానీ ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని ఆయన స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • congress
  • ED
  • Enforcement Directorate (ED)
  • rahul gandhi
  • sonia gandhi
  • TCongress
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd