Congress : కేటీఆర్‌కు కాంగ్రెస్ కౌంటర్.. కేటీఆర్ అంటేనే ఫేకు..
Congress : ఈ సందర్భంగా "అబద్ధపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్" అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణను వదిలి వెళ్ళిపోతుందనే అసత్య ప్రచారం బీఆర్ఎస్ నేతలు డీకే శివకుమార్ పేరుతో చేశారని ఆరోపించింది.
- By Kavya Krishna Published Date - 12:31 PM, Thu - 17 October 24

Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురువారం తన అధికారిక ఎక్స్ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేటీఆర్ పై, తీవ్రమైన విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా “అబద్ధపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్” అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణను వదిలి వెళ్ళిపోతుందనే అసత్య ప్రచారం బీఆర్ఎస్ నేతలు డీకే శివకుమార్ పేరుతో చేశారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ కేసు ఫైల్ చేయడంతో బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గారని, అయితే మళ్లీ తమిళనాడుకు వెళ్ళిపోతుందనే ఫేక్ ప్రచారం చేపట్టారని కాంగ్రెస్ పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఫాక్స్ కాన్ తెలంగాణలో మరింత విస్తరించే ఆలోచన చేస్తోందని తెలిపింది.
AP Ministers: బీసీలకు కవచం గా మారిన రక్షణ చట్టం : ఎపి మినిస్టర్స్
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ, “గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చిన వారు, ఇప్పుడు ఆ కూల్చివేతలను ఆపాలని మొసలి కన్నీరు కారుస్తున్నారు” అని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలంగాణ యువత నిరుద్యోగులుగా మారి ఆత్మహత్యలకు పాల్పడితే, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దుర్మార్గపు ప్రచారం చేయడంతో పాటు, సమర్థవంతమైన ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఆరోపించింది. పత్రికల్లో పెయిడ్ రాతలు రాయించిందని కూడా కాంగ్రెస్ పేర్కొంది.
ప్రఖ్యాత ఇంజనీర్‌గా పేరొందిన కేసీఆర్ నేతృత్వంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, దీనివల్ల లక్ష కోట్లు ప్రజాధనం వృధా అయిందని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. పన్నులు వేసి ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును ఇలా వృధా చేసినట్లు పేర్కొంది. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ఇతర పథకాల్లో భారీగా అవినీతికి పాల్పడి, ప్రభుత్వ కమిషన్లు దండుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం భూములు కేటాయించిందని, లక్షలాది రూపాయలు వెచ్చించి అవి నిర్మించారని కాంగ్రెస్ విమర్శించింది. ఈ చర్యలు ప్రజల డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తూ పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 7 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని, ఈ అప్పులను మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాల్సి వస్తోందని తెలిపారు. “బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులు ఇప్పుడు తెలంగాణ ప్రజల భుజాలపై భారమవుతున్నాయి” అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాంలో చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలలో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, చేయూత, ఎల్పీజీ సబ్సిడీ, గృహ జ్యోతి, విద్యుత్ సబ్సిడీ, బియ్యం సబ్సిడీ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, కల్యాణలక్ష్మి/ షాదీముబారక్ వంటి పథకాల కోసం రూ.54,346 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులను పునర్‌వ్యవస్థీకరించి, భవిష్యత్తులో తెలంగాణ ఆర్థిక సుస్థిరతను కాపాడేందుకు కృషి చేస్తోందని పేర్కొంది కాంగ్రెస్.
Citizenship Act : పౌరసత్వ చట్టంలోని ‘సెక్షన్ 6ఏ’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు