LPG Cylinder Price: భారీగా పెరిగిన వాణిజ్య సిలిండర్ ధర..!
- Author : HashtagU Desk
Date : 01-04-2022 - 10:33 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియాలో వంటగ్యాస్, పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి ధరలు రోజురోజుకూ పెరుగుతుండడంతో సామాన్యులు తీవ్ర ఆందోళణ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ వారు ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఎల్‌పీజీ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచిన కేంద్రం, తాజాగా వాణిజ్య సిలిండర్ ధరను కూడా పెంచింది. ఈ క్రమంలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌పై ధరను 273.50 రూపాయలకు పెంచేశారు. దీంతో హైదరాబాద్‌లో వ్యాణిజ్య సిలిండర్ ధర 2,186 రూపాయల నుంచి 2,460 రూపాయలకు చేరింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా వాణిజ్య సిలిండర్ ధర విపరీతంగా పెరిగిపోయింది. దీంతతో ప్రస్తుతం ఢిల్లీలో కమర్షియల్ సిలిండ్ ధర 2,253 రూపాయలకు ఎగబాకింది. గత రెండు నెలల్లో వాణిజ్య సిలిండర్ ధరపై ఏకంగా 346 రూపాయలుపెరగడం గమనార్హం. ఇక మార్చి ఒకటిన105 రూపాయలు పెరగగా, మార్చి 22న 9 రూపాయలు పెంచాయి. అయితే ఈసారి మాత్రం ఏకంగా 273.50 రూపాయలు పెంచేశారు.