CM Revanth Reddy : రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు
- By Sudheer Published Date - 01:02 PM, Thu - 9 January 25

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు (శుక్రవారం) తిరుమల శ్రీవారి దర్శనానికి (Tirumala) వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi) పర్వదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుటుంబసమేతంగా తిరుమలలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు రేపటి నుంచి ఈ నెల 19 వరకు వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార ద్వారా ప్రత్యేక దర్శనాలు నిర్వహించనున్నారు.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం పాకిస్థాన్ నుంచి లాగేసుకుంటారా?
ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు తెలిపాయి. ప్రొటోకాల్ ప్రకారం, సీఎం రేవంత్ రెడ్డి రేపు తెల్లవారుజామున 4:30 గంటలకు స్వామివారి దర్శనాన్ని ప్రారంభించనున్నారు. ప్రత్యేక దర్శనాల కోసం భక్తులకు వేర్వేరు గేట్ల ద్వారా ప్రవేశం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి.
వైకుంఠ ద్వార దర్శనం.. డిమాండ్ ఎందుకంటే..
హిందువులు ముక్కోటి ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో ఆలయ ప్రవేశం సర్వపాప హరమని విశ్వాసం. ఇక భూలోక వైకుంఠంగా భావించే తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనమంటే సాక్షాత్తూ ఆ వైకుంఠ ధామంలోకి ప్రవేశించినట్లుగా పులకరిస్తారు. ఏడాదిలో 10రోజులు మాత్రమే టీటీడీ ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే నిన్న ఈ దర్శన టోకెన్ల కోసం భక్తులు భారీగా రావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.