HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Comments On Ktr 2

Vemulawada : కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారు: సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.

  • Author : Latha Suma Date : 20-11-2024 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy Comments on KTR
CM Revanth Reddy Comments on KTR

CM Revanth Reddy : వేములవాడలో నిర్వహించిన ప్రజా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పై విమర్శులు గుప్పించారు. ప్రభుత్వంలో ఉంటూ కుట్రలు చేశారంటూ కేటీఆర్‌పై రేవంత్ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సక్రమంగా పరిహారం ఇవ్వలేదన్నారు. కుట్రలు చేసిన కేటీఆర్ ఊచలు లెక్కపెడతారంటూ హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కుట్రలను గమనిస్తున్నామని రేవంత్ పేర్కొన్నారు. ఎంత ఎగురుతావో ఎగురంటూ చురకలంటించారు. కేటీఆర్ తన వైఖరి మార్చుకోవాలని రేవంత్ పరోక్షంగా సూచించారు.

కేసీఆర్ పదేళ్లలో చేయలేని పనులను తాము చేస్తున్నామని, అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు మైండ్ పోయిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ గడిచిన పదేళ్లు సరిగ్గా పని చేసి ఉంటే రుణమాఫీ చేయాల్సి వచ్చేదా? అని, కేసీఆర్ వల్ల రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానం లో ఉందని చెప్పారు. ఇక 11 వెల కోట్ల రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారని, తాము 25 రోజుల్లో 23 లక్షల కుటుంబాలకు 18 వేల కోట్ల రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా తప్పించుకోమన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికిరైతులకు రెండు రెట్ల పరిహారం ఇస్తామన్నారు. పరిశ్రమలు రావాలంటే భూసేకరణ చేయాల్సిందేనన్నారు. తెలంగాణకు పరిశ్రమలు వద్దని బీఆర్‌ఎస్ కోరుకుంటుందా అని సీఎం ప్రశ్నించారు. భూమి మార్కెట్ ధర రూ.10 లక్షలు ఉంటే రూ.30 లక్షల పరిహారం ఇస్తామన్నారు. నష్ట పరిహారం ఎక్కువ ఇస్తే భూయజమానులు తమ భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తారన్నారు.

Read Also: YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్‌ జగన్‌.. గంటసేపు అక్కడే?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Leaders
  • CM Revanth Reddy
  • ktr
  • Praja Palana Vijayotsava Sabha
  • vemulawada

Related News

Telangana State Assembly Budget Sessions from March 16 to 30

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Virosh Wedding

    ఉదయ్‌పుర్‌ బయల్దేరిన విజయ్‌, రష్మిక

  • Ktrslbc

    SLBC : ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం – కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

Latest News

  • మార్చి నెలలో బ్యాంకులు ఎన్ని రోజులు మూత‌ప‌డ‌నున్నాయంటే?

  • ప్రభుత్వ కాలేజీలకు కొత్త ఊపు .. ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు : మంత్రి లోకేష్‌

  • వెంటనే లొంగిపోవాలి .. అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు

  • నా పేరుతో తప్పుడు స్టేట్‌మెంట్లు ప్రచారం చేయకండి: శిఖ‌ర్ ధావ‌న్‌

  • ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?

Trending News

    • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd