CM Revanth Reddy : సిక్స్ ప్యాక్ పై యువతకు సలహా ఇచ్చిన సీఎం రేవంత్
CM Revanth Reddy : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన "రైతు నేస్తం" కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
- By Kavya Krishna Published Date - 08:38 PM, Mon - 16 June 25

CM Revanth Reddy : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన “రైతు నేస్తం” కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతులతో ప్రత్యక్షంగా ముఖాముఖి మాట్లాడిన సీఎం, వారి విజయాలను ప్రశంసించడంతో పాటు సమస్యలను కూడా ఆప్యాయంగా విన్నారు. ఈ సందర్భంగా రైతులు కూరగాయల సాగు గురించి చేసిన ప్రస్తావనపై స్పందించిన రేవంత్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజూ జొన్న రొట్టె తింటే, జిమ్‌కు వెళ్లకుండానే సిక్స్‌ప్యాక్ బాడీ వస్తుంది. ఇప్పుడు యువత డైట్ పేరుతో అడ్డంగా గడ్డి లాంటి ఆహారం తింటున్నారు. కానీ, జొన్న రొట్టె తింటూ, ఎవరి బట్టలు వారే ఉతికుకుంటే జిమ్ అవసరమే ఉండదు,” అంటూ నవ్వులు పూయించేలా తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
CM Chandrababu : సీఎం చంద్రబాబు హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య..!
అచ్చంపేటలో పండించే దోసకాయకు కందిపప్పు జోడించి వండితే వచ్చే రుచిని గురించి మాట్లాడిన సీఎం, “ఆ వంటకు చికెన్, మటన్ కూడా సమానంగా రావు,” అని చెప్పారు. ఈ రోజుల్లో ఆ ప్రామాణికమైన రుచులు కనిపించడం లేదని, పంటల రకాలు కూడా చాలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులకు ఊరటనిచ్చే మరో ముఖ్య ఘటన జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేయించారు, ఇది రైతుల్లో ఉత్సాహాన్ని పెంచింది.
Annadata Sukhibhava Scheme : రైతులకు అన్నదాత సుఖీభవ ముఖ్య సమాచారం