HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Is Busy In Delhi

CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..

హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు

  • Author : Sudheer Date : 24-06-2024 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Rajan
Revanth Rajan

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth )..ఢిల్లీలో బిజీ బిజీ గా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రావిరాల గ్రామంలో తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన 2,462 ఎక‌రాల భూముల‌ను ఇమార‌త్ ప‌రిశోధ‌న కేంద్రం (ఆర్‌సీఐ) ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వ‌రంగ‌ల్ న‌గ‌రానికి గ‌తంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గ‌త రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మాణప‌రంగా ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని, వ‌రంగ‌ల్ సైనిక్ స్కూల్ అనుమ‌తుల గ‌డువు ముగిసినందున అనుమ‌తులు పున‌రుద్ధ‌రించాల‌ని లేదా తాజాగా మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రిని ముఖ్య‌మంత్రి కోరడం జరిగింది.

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ ను విజ్ఞప్తి చేశారు. నిరుపేద‌లకు వారి సొంత స్థ‌లాల్లో 25 ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌ని, రాష్ట్ర ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక రేపు మరికొందరు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు. నీట్ పరీక్ష అంశంపై మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… ఏ ఒక్కరి పైనో కేసు వేసి క్లోజ్ చేసేందుకు సీబీఐ దర్యాఫ్తునకు ఆదేశించారని విమర్శించారు. కానీ జ్యుడీషియల్ విచారణ అవసరమన్నారు. ప్రధాని మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు సైనిక్ స్కూల్ కావాలని… ఇదే విషయమై తాను కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అడిగానన్నారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

హైద‌రాబాద్‌లో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, ఇత‌ర అవ‌స‌రాల‌కు ర‌క్ష‌ణ శాఖ భూములు 2,450 ఎక‌రాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌దలాయించాల‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి @rajnathsingh గారిని ముఖ్య‌మంత్రి @revanth_anumula గారు విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ర‌క్ష‌ణ శాఖ మంత్రి గారిని క… pic.twitter.com/p3gk5RG8DS

— Telangana CMO (@TelanganaCMO) June 24, 2024

Read Also : MLC Jeevan Reddy : జీవన్ రెడ్డి ని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • delhi

Related News

Revanth Reddy, Allu Arjun

అల్లు అర్జున్ హాలీవుడ్‌లోనూ రాణించాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy  అల్లు సినిమాస్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిని దాటి హాలీవుడ్‌లోనూ రాణించాలని ఆకాంక్షించారు. తన కాలేజీ రోజుల్లో 100 కిలోమీటర్లు లారీల్లో వెళ్లి సినిమాలు చూసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు సినిమా ‘అవతార్’, ‘జురాసిక్ పార్క్’ వంటి చిత్రాల వసూళ్లతో పోటీపడాలని ఆయన అన్నారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ

    Latest News

    • Fire Accident : SCB మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి

    • పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

    • టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ వీడియో రిలీజ్

    • శుభమన్ గిల్, హర్షిత్ రాణాకు బీసీసీఐ బెస్ట్ క్రికెటర్ అవార్డు!

    • Gas Cylinder Booking : గ్యాస్ సిలిండర్ రావాలంటే ఇలా చేయండి..

    Trending News

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

      • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

      • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd