MLC Jeevan Reddy : జీవన్ రెడ్డి ని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ నేతలు
జీవన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసమే పని చేశారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన... కాంగ్రెస్ పక్షానే నిలబడ్డారన్నారు
- By Sudheer Published Date - 10:51 PM, Mon - 24 June 24

బిఆర్ఎస్ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతుండడం తో సీఎం రేవంత్ ఫుల్ ఖుషీలో ఉన్నప్పటికీ..సీనియర్ నేతలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (MLA Sanjay Kumar)..కాంగ్రెస్ లో చేరిక ఫై స్థానిక ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) ఆగ్రహం తో ఉన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవటంపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి నుండి జీవన్ రెడ్డి మద్దతుదారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. జీవన్ రెడ్డిని కలిసి జరుగుతున్న పరిణామాలపై చర్చిస్తున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి..బిజెపి లో చేరాలని కూడా జీవన్ రెడ్డి భావిస్తున్నాడట. ఈ విషయం కాంగ్రెస్ పెద్దలకు తెలియడం తో జీవన్ రెడ్డి ని బుజ్జగించే పనిలో పడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం రాత్రి మంత్రి శ్రీధర్ బాబు..జీవన్ రెడ్డి నివాసానికి చేరుకొని బుజ్జగించారు. అనంతరం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జీవన్ రెడ్డి ఎల్లప్పుడూ పార్టీ కోసమే పని చేశారన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజల పక్షాన… కాంగ్రెస్ పక్షానే నిలబడ్డారన్నారు. కానీ నిన్నటి ఘటనతో ఆయన మనస్తాపానికి గురయ్యారన్నారు. ఈ విషయం తెలియగానే ఇక్కడకు వచ్చి చర్చలు జరిపినట్లు చెప్పారు. ఆయన అసంతృప్తిని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళతామన్నారు. జగిత్యాల కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. 40 ఏళ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన… అలాగే ఉండాలని కోరుకుంటున్నామన్నారు.
Read Also : Nitish Kumar Reddy: టీమిండియాలో మరో తెలుగుతేజం.. ఐపీఎల్ మెరుపులతో నితీశ్ కు ఛాన్స్