CM KCR: సీఎం కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు..!
- Author : HashtagU Desk
Date : 11-03-2022 - 12:04 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కేసీఆర్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు. ఈ క్రమంలో అక్కడి వైద్యులు కేసీఆర్‌కు సిటీ స్కాన్, యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు.
ఇక గత రెండ్రోజులుగా కేసీఆర్ చాలా నీరసంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడమ చెయ్యి లాగుతుందని కేసీఆర్ చెప్పారని డాక్టర్ ఎన్వీ రావు తెలిపారు. దీంతో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నామని డాక్టర్ ఎన్వీ రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇక సీఎం కేసీఆర్ ఈరోజు యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సి వుంది. అయితే ఆయన ఆస్వస్థతకు గురవడంతో నేటి యాదాద్రి పర్యటణను రద్దు చేసుకున్నారు కేసీఆర్. ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాలపై ఆశక్తి చూపుతున్నా కేసీఆర్ ఢిల్లీ, మహారాష్ట్ర పర్యటనకు వెళ్ళి వచ్చారు. దీంతో ఈ మధ్యకాలంలో తీవ్ర వత్తిడికి గురయ్యారయని తెలుస్తోంది. ఇకపోతే సీఎం కేసీఆర్ హెల్త్‌కు సంబంధించి హెల్త్ బులిటిన్ విడుదల చేసే అవకాశం వుంది.