HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Jagan Meets Pm Modi Various Issues Discussed

CM Jagan Meets PM: మోదీతో జగన్ భేటీ…45నిమిషాల పాటు సాగిన సమావేశం..!!

ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం గురువారం ఢిల్లీ వెళ్లారు జగన్.

  • By Hashtag U Published Date - 07:45 PM, Thu - 2 June 22
  • daily-hunt
Before Election
Jagan Modi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం గురువారం ఢిల్లీ వెళ్లారు జగన్. సాయంత్రం 4:30గంటలకు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. దాదాపుగా 45 నిమిషాలపాటు ఈ భేటీ సాగింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు త్వరలో జరగనున్నరాష్ట్రపతి ఎన్నికపైనా కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం.

ప్రధాని మోదీతో భేటీ ముగించుకున్న జగన్…అటు నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. నిర్మలతో పలు అంశాలపై జగన్ చర్చలు జరిపారు. సాయంత్రం 5.30మొదలైన వీరిద్దరి భేటీ కేవలం పది నిమిషాల్లోనే ముగిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, పన్నుల రాబడి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న సహకారం, ఇంకా అందాల్సిన మద్దతు తదితరాలకు కేంద్ర మంత్రికి జగన్ వివరించినట్లుగా తెలుస్తోంది.

అనంతరం కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతోనూ జగన్ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అమిత్ షా, జగన్ ల భేటీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

– ప్రధాని శ్రీ నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ భేటీ
– రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ.
– 45 నిమిషాలకు పైగా ప్రధానితో సమావేశమైన ముఖ్యమంత్రి.
– రెవిన్యూలోటు భర్తీ, పోలవరంప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో తారతమ్యాల సవరణ, ఏపీఎండీసికి గనులు కేటాయింపు, మెడికల్‌ కాలేజీలు తదితర అంశాలను ప్రధానికి నివేదించిన సీఎం.
– ఈమేరకు వినతిపత్రాన్నికూడా అందించిన సీఎం.

– 2014–15కు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం బకాయిల విషయంలో, డిస్కంల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ ప్యాకేజీ రూపంలో, వృద్ధులకు పెన్షన్లు, రైతుల రుణమాఫీకి సంబంధించి మొత్తంగా రూ.32,625 కోట్లు రెవెన్యూ గ్యాప్‌ కింద రాష్ట్రప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఈ అంశంపై వెంటనే దృష్టిసారించి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేసిన సీఎం

– తెలంగాణ ప్రభుత్వం రూ.6,627.86 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలను చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలోని విద్యుత్‌పంపిణీ, ఉత్పాదక సంస్థలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈవ్యవహారాన్ని వెంటనే సెటిల్‌ చేయాల్సిందిగా సీఎం విజ్ఞప్తి

– 2016–17 నుంచి 2018–19 వరకూ అప్పటి ప్రభుత్వ నిర్దేశించిన పరిమితికి మించి చేసిన అప్పులను పరిగణలోకి తీసుకుని, ఇప్పుడు రుణ పరిమితిలో కోత విధిస్తున్నారు. గడచిన మూడేళ్లలో రూ.17,923 కోట్ల రూపాయల మేర రుణ పరిమితిలో కోత విధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటన్నవి రుణాలే కాని, గ్రాంట్లు కావు. కోవిడ్‌ లాంటి విపత్తుల దృష్ట్యా ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానిని కోరిన సీఎం

– సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనాలను రూ.55,548.87 కోట్లకు ఖరారు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. ఇప్పటికే సాంకేతిక సలహా మండలి దీనికి ఆమోదం తెలిపింది.
– పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డ్రింకింగ్‌ వాటర్‌ కాంపొనెంట్‌ను ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్భాగంగా చూడాలని విజ్ఞప్తిచేస్తున్నాను. గతంలో జాతీయహోదా ప్రాజెక్టుల విషయలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించాలని కోరుతున్నాను.
– పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కాంపొనెంట్‌వారీగా విడివిడిగా కాకుండా… మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రియింబర్స్‌ చేయాలని విజ్ఞప్తిచేస్తున్నాను. ఈ ఆంక్షల వల్ల రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులను ఖర్చుచేసిన రూ.905.51 కోట్ల రూపాయలను చెల్లించలేదన్న సీఎం. ప్రాజెక్టుకోసం చేసిన ఖర్చును 15 రోజుల్లోగా చెల్లించేలా చూడాలని కోరిన సీఎం.
– ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీని డీబీటీ పద్ధతిలో చేయాలని, దీనివల్ల చాలావరకు జాప్యాన్ని నివారించవచ్చంటూ విజ్ఞప్తిచేసిన సీఎం.
– పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా, సజావుగా సాగడానికి వీలుగా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే మొదటి స్పెల్‌లో నిధులు అడ్వాన్స్‌గా ఇస్తే.. వీటికి సంబంధించి 80శాతం పనులు పూర్తైన తర్వాత రెండో స్పెల్‌లో మిగిలిన నిధులు ఇవ్వాలని కోరిన సీఎం.

– జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్‌ కార్డు లబ్ధిదారుల ఎంపికలో ఉన్న అసమానతలను తొలగించాలని కోరిన సీఎం. కేంద్ర రాష్ట్రానికి చెందిన సంబంధిత శాఖల అధికారులతో నీతిఆయోగ్‌ సమావేశమై, ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న బియ్యం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తించిందని, దీన్ని వెంటనే పునఃసమీక్షించాలని చెప్పిందని ప్రస్తావించిన ముఖ్యమంత్రి. జాతీయ ఆహారభద్రతా చట్టం కింద ఇస్తున్న బియ్యంలో దేశంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ ఉందని, ఇందులో రాష్ట్రానికి కేటాయింపులు చేస్తే సరిపోతుందంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని తెలిపిన ముఖ్యమంత్రి. నెలకు 0.77లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలంటూ నీతిఆయోగ్‌ సిఫార్సును ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సీఎం. అలాగే ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన కింద కూడా తక్కువ కేటాయింపులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి. దాదాపు 56 లక్షల కుటుంబాలు కవర్‌ కావడంలేదని, వీరికిచ్చే బియ్యం సబ్సిడీ భారాన్ని రాష్ట్రం భరిస్తోందంటూ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సీఎం.

– రాష్ట్రంలో కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేశాం. దీంతో జిల్లాల సంఖ్య 26కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా మరో 3 మెడికల్‌ కాలేజీలకే కేంద్రం అనుమతి ఇచ్చింది. వీటిపనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తంగా 26 జిల్లాలకు 14 మెడికల్‌ కాలేజీలు ఉన్నట్టు అవుతుంది. రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలంటే.. మెడికల్‌ కాలేజీలు చాలా అవసరం. మిగిలిన 12 కాలేజీలకు అనుమతులు మంజూరుచేయాలని విజ్ఞప్తిచేసిన సీఎం.

– విశాఖ సమీపంలోని భోగాపురంలో ఎయిర్‌పోర్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గతంలో ఇచ్చిన క్లియరెన్స్‌ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాను. ఈమేరకు పౌరవిమానయానశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వగలరు.

– ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం కడపలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వాణిజ్యపరంగా ఈ ప్లాంట్‌ నడిచేందుకు నిరంతరాయంగా ఐరన్‌ ఓర్‌సరఫరా చేసేందుకు వీలుగా ఏపీఎండీసీకి ఇనుపగనులు కేటాయించాలని కోరుతున్నాం. రాయలసీమ ప్రజల జీవనోపాధికి, ఈప్రాంతంలో ఆర్థిక ప్రగతికి స్టీల్‌ప్లాంట్‌ అన్నది చాలా అవసరం.

– ఇంటిగ్రేటెడ్‌ బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళిక వేస్తోంది. ఈరంగంలో దాదాపు రూ.20వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి. 16 చోట్ల బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రతిపాదనలను అందించాం. 14 చోట్ల అనుమతులు పెండింగులో ఉన్నాయి. ఏపీఎండీసీకి వీటిని కేటాయించాల్సిందిగా విజ్ఞప్తిచేస్తున్నాం.

The Chief Minister of Andhra Pradesh Shri @ysjagan called on PM @narendramodi. pic.twitter.com/CWj4Q9zRVX

— PMO India (@PMOIndia) June 2, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP cm meets prime minister
  • cm jagan
  • pm modi

Related News

India Cricket Team

PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

భారత మహిళల క్రికెట్ జట్టు బుధవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నట్లు సమాచారం. గత సంవత్సరం 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత పురుషుల జట్టుకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆతిథ్యం ఇచ్చారు.

  • Sardar Vallabhbhai Patel

    Sardar Vallabhbhai Patel: నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి!

Latest News

  • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

  • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

  • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

  • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd