Chit Fund Scam : ఏపీలో మహిళ ఘరనా మోసం.. చిట్‌ఫండ్ పేరుతో పదికోట్లు టోకరా
చిట్ ఫండ్ పేరుతో ఓ మహిళ ప్రజల్ని మోసం చేసింది. 200 మంది వద్ద 10 కోట్లు పైగా వసూళ్లు చేసి మోసం చేసిన ఘటన
- Author : Prasad
Date : 07-11-2023 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
చిట్ ఫండ్ పేరుతో ఓ మహిళ ప్రజల్ని మోసం చేసింది. 200 మంది వద్ద 10 కోట్లు పైగా వసూళ్లు చేసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం సాయినగర్‌లోని మర్రిపాలెంకు చెందిన వరలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. వరలక్ష్మి తమను మోసం చేసిందని ఆరోపిస్తూ బాధితులు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పలువురు బాధితులు తమ పెట్టుబడులపై ఆందోళనతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు నిందితురాలు వరలక్ష్మిని మర్రిపాలెంలోని ఆమె నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి వరలక్ష్మీ వద్ద నుంచి పలు కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసున్నారు. అయితే వరలక్ష్మీ బాధితులు మాత్రం ఒక్కొక్కరిగా బయటికి వస్తున్నారు.