Chief Minister Revanth Reddy: నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కారణమిదే..?
- Author : Gopichand
Date : 30-06-2024 - 9:32 IST
Published By : Hashtagu Telugu Desk
Chief Minister Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని, డీఎస్‌కు నివాళి అర్పించనున్నారు. ఉదయం బెంగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డీఎస్ ఇంటికి వెళ్లి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Also Read: Sindhur: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?
సీఎం రేవంత్ నిజామాబాద్ చేరుకున్న తర్వాత ప్రగతి నగర్‌లో డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం రేవంత్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు డీఎస్ భౌతికకాయానికి మంత్రులు, రాజకీయ నాయకులు నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు డీఎస్ స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. బైపాస్ రోడ్డులో గల స్వంత స్థలంలో డి.ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంచనలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join