Minister Lokesh : ఏపీలో ఒంటిపూట బడుల సమయంలో మార్పులు
స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
- By Latha Suma Published Date - 12:54 PM, Tue - 18 March 25

Minister Lokesh : వేసవి నేపథ్యంలో ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండటంతో ఒక్కపూట బడుల సమయ వేళల్లో మార్పులు చేయాలని మంత్రి నారా లోకేష్ అదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో ఒంటిపూట బడులు మధ్యాహ్నం 1. 30 లకు ప్రారంభించాలని మంత్రి తన ఆదేశాల్లో తెలిపారు. టెన్త్ పరీక్షలు ఉదయం 9. 30 నుంచి మధ్యాహ్నం 12. 45 వరకు జరుగుతున్నాయి. పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిపూట బడులు మధ్యాహ్నం 1.15కు ప్రారంభం అవుతున్నాయి.
Read Also: Telangana Assembly : ఎస్సీ వర్గీకరణ బిల్లుపై నేడు అసెంబ్లీలో చర్చ
కాగా, పదో తరగతి పరీక్షల నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ లు ఉన్న స్కూళ్లలో అధికారులు మధ్యాహ్నం పూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు పదో తరగతి విద్యార్థులకు పరీక్ష మొదలవుతుండగా మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష పూర్తవుతోంది. ఆ తర్వాత జవాబు పత్రాలను సీల్ చేసి పరీక్షా కేంద్రం నుంచి పంపిస్తున్నారు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో స్కూలుకు వచ్చిన విద్యార్థులు పదో తరగతి జవాబు పత్రాలు పంపించేంత వరకు ఎండలో వేచి చూడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఒంటిపూట బడులను మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెన్త్ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి రెండు రాష్ట్రాల్లోనూ అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే విద్యా శాఖ అధికారులు వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ ఖరారు చేసారు.
Read Also: Hydraa : హైడ్రా పేరుతో వసూళ్ల దందా – కేటీఆర్ ట్వీట్