Hydraa : హైడ్రా పేరుతో వసూళ్ల దందా – కేటీఆర్ ట్వీట్
Hydraa : మూసీ నది పరిసరాల్లో ఉన్న పేదల ఇళ్లను బలవంతంగా తొలగిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు
- By Sudheer Published Date - 11:51 AM, Tue - 18 March 25

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) హైడ్రా (Hydraa) పేరుతో భారీ స్థాయిలో వసూళ్ల దందా నిర్వహిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఓ వార్తా కథనాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసిన కేటీఆర్, పేదల ఇళ్లపై ప్రభుత్వ పెద్దలు పగబట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది పరిసరాల్లో ఉన్న పేదల ఇళ్లను బలవంతంగా తొలగిస్తూ, మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు.
HKU1: హెచ్‌కేయూ1 వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏమిటి?
సీఎం కుటుంబం ఫోర్త్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపించారు. ఒకవైపు పేదలను ఇళ్ల నుండి వెలివేస్తూనే, మరోవైపు పెద్దలతో లావాదేవీలు చేస్తూ భారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. చిన్న స్థాయి ప్రజలపై ప్రతాపం చూపిస్తూ, కార్పొరేట్ స్థాయిలో ఒప్పందాలకు మొగ్గుచూపుతున్న ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలో రాష్ట్రాన్ని పాతాళానికి నెట్టివేశారని కేటీఆర్ మండిపడ్డారు. అభివృద్ధికి బదులుగా అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని, దీనిపై ప్రజలు త్వరగా మేల్కొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల కోసం తాము పోరాడుతూనే ఉంటామని, అధికార దుర్వినియోగంపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
హైడ్రా పేరుతో
వసూళ్ల దందామూసీ పేరుతో
పేదల ఇండ్లపై పగఫార్మాసిటీ పేరుతో
భూముల చెరఫోర్త్ సిటీ పేరుతో
సీఎం కుటుంబ రియల్ వ్యాపారంట్రిపుల్ ఆర్ పేరుతో
పేదల భూముల ఆక్రమణపేదలపై ప్రతాపం
పెద్దలతో ఒప్పందంనాడు మద్యం వద్దు
నేడు మద్యం ముద్దుధరల సవరణ పేరుతో,
కొత్త బ్రాండ్ల… pic.twitter.com/8wqcotjsqD— KTR (@KTRBRS) March 18, 2025