Chandrababu vs Jagan: జగన్‌కు చంద్రబాబు వార్నింగ్.. అసలు మ్యాటర్ ఇదే..!
- By HashtagU Desk Published Date - 10:57 AM, Fri - 11 February 22

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సీఎం కాగానే కళ్ళు నెత్తికెక్కాయని, ఈ క్రమంలో జగన్ చేసిన ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. అధికారం ఉందన్న అహంతో, అక్రమంగా కేసులు బనాయించి టీడీపీ నేతల్ని వేధిస్తున్నారని, టీడీపీ తమ్ముళ్ళను భయభ్రాంతులకు గురి చేయడానికే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఇలాంటి చర్యల వల్ల జగన్ మోహన్ రెడ్డి ఏం సాధించాలని అనుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే, రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తూ జగన్ పబ్బం గడుపుకుంటున్నారని, దీంతో జగన్ సాధించేదేం లేదన్నారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ కూడా అందులో భాగమేనని, పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరుపున పోరాటం చేస్తున్నందుకే, అశోక్ బాబును అర్ధరాత్రి అరెస్ట్ చేశారని చంద్రబాబు అరోపించారు. అశోక్ బాబు అరెస్ట్‌తో తెలుగు దేశం పార్టీ పై జగన్ ప్రభుత్వం కక్షసాధిపు చర్యలు మరోసారి నిజమని తేలిందని చంద్రబాబు అన్నారు. ఇలాంటివి కోర్టులో నిలబడే కేసులు కాదని, ఈ క్రమంలో న్యాయస్థానంలోనే పోరాడి తేల్చుకుంటామని చంద్రబాబు అన్నారు.