Rajahmundry Central Jail : చంద్రబాబు ఫస్ట్ డే జైలు జీవితం ఎలా గడుస్తుందంటే..
అర్ధరాత్రి జైలు కు వచ్చిన చంద్రబాబు..రోజూవారీగానే సోమవారం ఉదయం 4 గంటలకు నిద్రలేచి..యోగ , వ్యాయామం చేసారు
- Author : Sudheer
Date : 11-09-2023 - 12:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ స్కిల్ డెవలవప్‌మెంట్ (Skill Development Case)కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏసీబీ కోర్టు (ACB Court) 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. రాజమండ్రి జైలు అధికారులు.. చంద్రబాబుకు స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గదిని చంద్రబాబు కు సిద్ధం చేశారు. ఈ గదిలో అన్ని వసతి సౌకర్యాలు కలిపించారు.
అర్ధరాత్రి జైలు కు వచ్చిన చంద్రబాబు(Chandrababu)..రోజూవారీగానే సోమవారం ఉదయం 4 గంటలకు నిద్రలేచి..యోగ , వ్యాయామం చేసారు. ఇంటి నుండి వచ్చిన ఫ్రూట్ సలాడ్‌ను ఆయన సిబ్బంది తీసుకెళ్లారు. అలాగే వేడి నీళ్లు, బ్లాక్ కాఫీని కుటుంబసభ్యులు చంద్రబాబుకు పంపారు. కాసేపట్లో చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజు చంద్రబాబు ఆరోగ్యం పట్ల డాక్టర్స్ శ్రద్ద తీసుకోనున్నారు. మరోవైపు చంద్రబాబుతో ములాఖత్‌కు ముగ్గురు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. ములాఖత్ సమయంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆయన్ను కలవనున్నారు.
Read Also : PV Ramesh : అధికారులను వదిలేసి.. మాజీ సీఎంను అరెస్ట్ చేయడమేంటి : పీవీ రమేశ్
మరోపక్క చంద్రబాబు తరుపు లాయర్ సిద్దార్థ్ లూథ్రా (Lawyer Sidharth Luthra) సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో భాగంగా పై వ్యాఖ్యలు చేశారు. నేడు చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై తమ వాదనలు వినిపిస్తామన్నారు. గతంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని సిద్దార్థ్ లూద్రా తెలిపారు.