TRS vs BJP : టీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. ప్రధాని పర్యటనను..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను అధికార టీఆర్‌ఎస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం..
- By Prasad Published Date - 10:18 PM, Thu - 10 November 22

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను అధికార టీఆర్‌ఎస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం చేస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనలో తన మద్దతును అందించడం లేదని, చౌకబారు విమర్శలకు పాల్పడుతోందని ఆచన ఆరోపించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ని ఏర్పాటు చేయడం వల్ల స్థానిక యువతకు ఉపాధి హామీ ఇవ్వడంతో పాటు రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయడం జరిగిందన్నారు.ప్రధాని పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపించామని తెలిపారు. ముఖ్యమంత్రిని అగౌరవపరిచే దురుద్దేశం కేంద్రప్రభుత్వానికి గానీ, అధికారులకు గానీ లేదని, బీజేపీ ప్రభుత్వం గడువు దాటి తెలంగాణ నుంచి వరిధాన్యం కొనుగోలు చేస్తోందని తెలిపారు.