CISF Raising Day : సీఐఎస్‌ఎఫ్ రైజింగ్ డే కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర హోమంత్రి అమిత్ షా
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) 54వ వార్షిక రైజింగ్ డే వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- By Prasad Published Date - 08:27 AM, Sun - 12 March 23

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్) 54వ వార్షిక రైజింగ్ డే వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్ననే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ రోజు(ఆదివారం) ఉదయం హైదరాబాద్‌లోని నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (నిసా)లో ఈ కార్యక్రమం జరగనుంది. విమానాశ్రయంలో రాష్ట్ర బీజేపీ నేతలు హోంమంత్రికి స్వాగతం పలికారు. భారతదేశ అంతర్గత భద్రతకు మూలస్తంభాలలో సిఐఎస్‌ఎఫ్ ఒకటని కేంద్ర హోమంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. ఈ పరేడ్ ప్రతి ఏడాది ఢిల్లీ శివార్లలోని ఘజియాబాద్‌లోని సిఐఎస్‌ఎఫ్ మైదానంలో జరిగేది. ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Related News

Hyderabad: శ్రీరామనవమి శోభాయాత్ర.. మసీద్, దర్గాలకు క్లాత్ చుట్టేసి?
భారతదేశం లోని హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి కూడా ఒకటి. శ్రీరామనవమి రోజున