Train Services: రైల్వే ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. 20 రైళ్లు రద్దు!
జనవరి 8, 2025న కూడా 20 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. జనవరి 10, 2025 వరకు చాలా రైళ్లను రైల్వే రద్దు చేసింది. 8 జనవరి 2025న ఏ రైళ్లు రద్దు చేశారో ఇప్పుడు చూద్దాం.
- Author : Gopichand
Date : 08-01-2025 - 8:29 IST
Published By : Hashtagu Telugu Desk
Train Services: దేశవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఓ వైపు కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తుండగా మరోవైపు దట్టమైన పొగమంచుతో జనజీవనం మందగించింది. దట్టమైన పొగమంచు ప్రభావం ట్రాఫిక్‌పై కనిపిస్తోంది. పొగమంచు కారణంగా భారతీయ రైల్వే శాఖ ప్రతిరోజూ డజన్ల కొద్దీ రైళ్లను (Train Services) రద్దు చేయవలసి వస్తుంది. జనవరి 8, 2025న కూడా 20 కంటే ఎక్కువ రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. జనవరి 10, 2025 వరకు చాలా రైళ్లను రైల్వే రద్దు చేసింది. 8 జనవరి 2025న ఏ రైళ్లు రద్దు చేశారో ఇప్పుడు చూద్దాం.
రద్దు చేయబడిన రైళ్ల జాబితా
- రైలు నెం. 55074, బధ్ని-గోరఖ్‌పూర్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55073, గోరఖ్‌పూర్-బధాని అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55056, గోరఖ్‌పూర్-ఛప్రా అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55055, ఛప్రా-గోరఖ్‌పూర్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55036, గోరఖ్‌పూర్ కాంట్-సివాన్ అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55035, సివాన్-గోరఖ్‌పూర్ కాంట్ అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నం. 55038, థావే-సివాన్ అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నం. 55037, సివాన్-థావే అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55098, గోరఖ్‌పూర్ కాంట్-నర్కతీయగంజ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నం. 55097, నార్కతియాగంజ్-గోరఖ్‌పూర్ కాంట్ అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55048, గోరఖ్‌పూర్ కాంట్-నర్కటియగంజ్ అన్‌రిజర్వ్‌డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నెం. 55047, నార్కతియాగంజ్-గోరఖ్‌పూర్ కాంట్ అన్‌రిజర్వ్డ్ ప్రత్యేక రైలు రద్దు
- రైలు నంబర్- 22429, ఢిల్లీ నుండి పఠాన్‌కోట్ రైలు రద్దు
- రైలు నెం. 12497, న్యూఢిల్లీ-అమృత్‌సర్ రైలు రద్దు
- రైలు నంబర్- 12498, అమృత్‌సర్ నుండి న్యూఢిల్లీకి నడుస్తున్న రైలు రద్దు
- రైలు నంబర్- 12459, ఢిల్లీ నుండి అమృత్‌సర్‌కు వెళ్లే రైలు రద్దు
Also Read: Sundeep Kishan : సందీప్ కిషన్ కి ఆ ఎక్స్ పీరియన్స్ అయ్యిందా..?
ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్స్
ఇవే కాకుండా నడుస్తున్న రైళ్లు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలు దాదాపు 8 నుంచి 10 గంటల వరకు ఆలస్యమవుతున్నాయి. జనవరి 8వ తేదీ (నేడు) ఉదయం 9.55 గంటలకు పుదుచ్చేరి నుంచి బయలుదేరాల్సిన రైలు నెం. 22403 పుదుచ్చేరి-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు పుదుచ్చేరి నుంచి ఉదయం 11.00 గంటలకు (1 గంట 05 నిమిషాలు ఆలస్యంగా) బయలుదేరనుంది.