HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bombay High Court Granted Bail To Chanda Kochhar

Chanda Kochhar : చందాకొచ్చర్‌ కు బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు

ఐసీఐసీఐ బ్యాంకు (Icici Bank) మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు

  • Author : Maheswara Rao Nadella Date : 09-01-2023 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chanda Kochhar
Chanda

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్ (Chanda Kochhar)‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు (Bombay High Court) లో ఊరట.. వీరిని జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా కొచ్చర్‌ దంపతుల అరెస్టు జరగలేదని కోర్టు స్పష్టం చేసింది. వీడియోకాన్‌ (Videocon) గ్రూప్‌ నకు రుణాల మంజూరు వ్యవహారంలో గత డిసెంబరు 23న కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్టు.. ప్రస్తుతం వీరు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే తమను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అంతేగాక, తమ కుమారుడి వివాహం నిశ్చయమైందని, ఇప్పటికే బంధువులందరికీ ఆహ్వానాలు పంపిన నేపథ్యంలో కార్యక్రమం రద్దు చేయడం సరికాదంటూ తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కొచ్చర్‌ దంపతుల అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలిపింది. ఈ క్రమంలోనే వారికి బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. పూచీకత్తు కింద చెరో రూ. లక్ష జమ చేయాలని కొచ్చర్‌ దంపతులను ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సహకరించాలని, సీబీఐ సమన్లు జారీ చేసినప్పుడు హాజరు కావాలని వారికి సూచించింది. అంతేగాక, వారి పాస్‌పోర్టులను కూడా సీబీఐకి సమర్పించాలని ఆదేశించింది.

వీడియోకాన్‌ గ్రూప్‌ (Videocon Loan Case) కంపెనీలకు 2012లో మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ (Chanda Kochhar) దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు బ్యాంకు సీఈఓ హోదాలో ఉన్న రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారడంతో ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు మంజూరు రుణంలో కోట్లాది రూపాయలను దీపక్‌ కొచ్చర్‌ (Deepak Kochhar) నిర్వహించే న్యూపవర్‌లో వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు పేర్కొంది. ఈ కేసులో చందా కొచ్చర్‌ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్‌ గ్రూపునకు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది.

Also Read:  Rishi Sunak : రిషి సునాక్ కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురుదెబ్బ..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bail
  • Bombay
  • chanda kochhar
  • High Court

Related News

Rajahmundry Police Issue Notices to Ambati Rambabu and Jakkampudi Raja

అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాకు పోలీసుల షాక్..

Ambati Rambabu  మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే…

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Latest News

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

  • Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

  • Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?

  • కుమారుడి బ‌ర్త్ డే.. రూ. 4 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పాండ్యా!

  • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd