Bypoll Results : త్రిపురలోని 2 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కైవసం.. ఇండియా కూటమికి ఓటమి
Bypoll Results : త్రిపురలోని ధన్‌పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమికి ఓటమి ఎదురైంది.
- Author : Pasha
Date : 08-09-2023 - 11:49 IST
Published By : Hashtagu Telugu Desk
Bypoll Results : త్రిపురలోని ధన్‌పూర్, బోక్సానగర్ అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమికి ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ సపోర్ట్ తో ఈ రెండు చోట్ల బరిలో నిలిచిన సీపీఎం అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. బాక్సానగర్‌లో సీపీఎం అభ్యర్థి మీజాన్ హుస్సేన్‌పై బీజేపీ అభ్యర్థి తఫజ్జల్ హుస్సేన్ గెలిచారు. బీజేపీకి చెందిన తఫజ్జల్ హుస్సేన్ కు 34,146 ఓట్లు, సీపీఎంకు చెందిన మీజాన్ హుస్సేన్ కు 3,909 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు ఎండీ సలీమ్ కు 181 ఓట్లు, రతన్ హుస్సేన్ కు 144 ఓట్లు వచ్చాయి. ఇక ధన్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సీపీఎం అభ్యర్థి కౌశిక్ చందాపై బీజేపీకి చెందిన బిందు దేబ్‌నాథ్ 18871 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక మరో ఆరురాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాల బైపోల్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
Also read : By Poll – 6 States : 7 బైపోల్స్ కౌంటింగ్ షురూ.. ఏ స్థానంలో ఏ పార్టీ ఆధిక్యంలో ఉందంటే.. ?
డుమ్రీలో జేఎంఎం ఆధిక్యం
జార్ఖండ్ లోని డుమ్రీ అసెంబ్లీ స్థానంలో ఇండియా కూటమి బలపర్చిన జేఎంఎం అభ్యర్థి బేబీదేవి తన సమీప ఏజేఎస్‌యూ పార్టీ ప్రత్యర్థి యశోదా దేవిపై 1,341 ఓట్ల ఆధిక్యంలో (Bypoll Results) ఉన్నారు. రెండు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సమయానికి జేఎంఎం అభ్యర్థి బేబీదేవి 7,314 ఓట్లను సాధించగా, AJSU పార్టీ అభ్యర్థి 5,973 ఓట్లను పొందారు.