Sreenivasa Prasad Dies: మాజీ కేంద్ర మంత్రి శ్రీనివాస ప్రసాద్ మృతి
కర్ణాటకలోని చామరాజనగర్‌కు ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 76 సంవత్సారాలు.
- Author : Praveen Aluthuru
Date : 29-04-2024 - 10:58 IST
Published By : Hashtagu Telugu Desk
Sreenivasa Prasad Dies: కర్ణాటకలోని చామరాజనగర్‌కు ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస ప్రసాద్ సోమవారం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 76 సంవత్సారాలు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
మైసూరు జిల్లా నంజన్‌గూడ నుంచి ఆరుసార్లు ఎంపీగా, రెండుసార్లు చామరాజనగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఏడాది మార్చి 18న దాదాపు 50 ఏళ్ల ప్రజా జీవితానికి ముగింపు పలికిన ప్రసాద్ ఎన్నికల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 1976లో పాత జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.1979లో కాంగ్రెస్‌లో చేరాడు. బీజేపీలో చేరడానికి ముందు అతను జేడీఎస్, జెడియు మరియు సమతా పార్టీలతో కూడా కొనసాగాడు. శ్రీనివాస్ ప్రసాద్ 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో వినియోగదారుల వ్యవహారాల ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు.
We’re now on WhatsApp. Click to Join
2016లో శ్రీనివాస్ ప్రసాద్ కర్ణాటక అసెంబ్లీకి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. 2017లో నంజన్‌గూడు ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో చామరాజనగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
Also Read; Mahesh Babu : మహేష్ మంజుల వైరల్ అవుతున్న వీడియో..!