Hindi Belt : రాజస్థాన్‌లో 41 చోట్ల బీజేపీ లీడ్.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ లీడ్
Hindi Belt : హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ మొదలైంది.
- By Pasha Published Date - 08:34 AM, Sun - 3 December 23

Hindi Belt : హిందీ బెల్ట్ రాష్ట్రాల్లోనూ ఉదయం 8 గంటలకు ఓట్ల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8.30 గంటల సమయానికి.. రాజస్థాన్‌లో 41 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఈ రాష్ట్రంలో పోలింగ్ జరిగిన 199 సీట్లలో కనీసం 100 స్థానాలను గెల్చుకునే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. అందుకు అనుగుణంగానే ఓట్ల కౌంటింగ్ ప్రారంభంలో బీజేపీ లీడ్‌లో ఉండటం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join.
మధ్యప్రదేశ్‌లోని మొత్తం 230 స్థానాలకుగానూ 23 స్థానాల్లో కాంగ్రెస్, 22 స్థానాల్లో బీజేపీ లీడ్‌లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 116 సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. గెలిచే అవకాశాలు బీజేపీకే ఎక్కువని పేర్కొన్నాయి.
Also Read: Rajasthan CM : సీఎం సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్‌లోకి వసుంధరా రాజే ?
ఛత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకుగానూ 20 చోట్ల కాంగ్రెస్, 15 చోట్ల బీజేపీ లీడ్‌లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 46 సీట్లు సాధించే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెసే గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్(Hindi Belt) చెప్పాయి.