Rajasthan CM : సీఎం సీటు ఇవ్వకుంటే కాంగ్రెస్‌లోకి వసుంధరా రాజే ?
Rajasthan CM : రాజస్థాన్‌లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
- By Pasha Published Date - 08:20 AM, Sun - 3 December 23

Rajasthan CM : రాజస్థాన్‌లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు ? అనే దానిపై సర్వత్రా డిస్కషన్ జరుగుతోంది. గతంలో రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే.. ఈసారి పార్టీ గెలిస్తే తనకే అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన మరోలా ఉంది. అందుకే ఈసారి పార్టీ తరఫున సీఎం అభ్యర్థి పేరును ప్రకటించలేదు. బీజేపీ అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వసుంధరా రాజే నిరాశకు గురయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు కేంద్రమంత్రులు, ఎంపీలను కూడా బీజేపీ పెద్దలు పోటీకి దింపారు. దీంతో వారిలో ఒకరికి సీఎంగా ఛాన్స్ ఇచ్చే యోచన ఉందనే పరోక్ష సంకేతాలు ఇచ్చారు. గజేంద్ర సింగ్, దియా కుమారి, అర్జున్ రామ్, మహంత్ బాలక్ నాథ్, భూపేందర్ యాదవ్, అశ్విని వైష్ణవ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్లను రాజస్థాన్ సీఎం పోస్టు కోసం బీజేపీ పరిశీలిస్తోందని అంటున్నారు. ఈమేరకు రాజస్థాన్ మీడియాలో వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఎంతోమంది వసుంధరా రాజే అనుచరులకు టికెట్లు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. దీంతో వారంతా బీజేపీ రెబల్స్‌గా బరిలోకి దిగారు.
Also Read: Telangana Results : అందరి చూపు కామారెడ్డి ..గజ్వేల్ రిజల్ట్ పైనే..
ఈ తరుణంలో తనకు సీఎంగా ఛాన్స్ దక్కే అవకాశాలు లేవనే అంచనాకు వసుంధర వచ్చారు. ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాక.. తనకు అనుకూలంగా ఉండే స్వతంత్ర అభ్యర్థులు , రెబల్ అభ్యర్థులతో కలిసి సీఎం సీటును డిమాండ్ చేయాలనే ప్లాన్‌లో వసుంధరా రాజే ఉన్నారని సమాచారం. ఒకవేళ బీజేపీ పెద్దలు అందుకు నో చెబితే.. అనివార్య పరిస్థితుల్లో కాంగ్రెస్ వైపేనా వెళ్లేందుకు ఆమె సిద్ధపడొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వసుంధరా రాజేకు, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు(కాంగ్రెస్) ఉన్న రాజకీయ సంబంధాలు ఇందుకు బాటలు వేసే అవకాశం ఉందని(Rajasthan CM) అంటున్నారు.