HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Big Fight Of Bjp Leaders For That Lok Sabha Seat Key Leaders In The Race

LS Polls: ఆ లోక్ సభ సీటు కోసం బీజేపీ నేతల బిగ్ ఫైట్.. రేసులో కీలక నేతలు

  • Author : Balu J Date : 18-02-2024 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BJP List
Bjp Opposition Partys

LS Polls: దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్ గిరిలో భారతీయ జనతా పార్టీ నుంచి ఆశావాహులు తాకిడి అధికంగా ఉంది. పార్టీ అధిష్టానం అభ్యర్థుల జాబితా తయారీలో తల మునకలై గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలోనే…..ఈ స్థానం పై కన్నేసిన కొందరు ఆశావహులు తమకే టికెట్ ఖరారు అయినట్లుగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార ఆర్భటంలో భాగంగా….. ఫ్లెక్సీలు ఏర్పాటు చేపడుతున్నారు.మరికొందరైతే మరో అడుగు ముందుకేసి వాల్ పోస్టర్లు అతికించడంతో పాటు ఎన్నికల ప్రచార రథాలను పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో తిప్పుతున్నారు. పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఖరారు చేయకముందే పలువురు నేతలు ఎన్నికల ప్రచారాన్ని మురిపించేలా కార్యక్రమాలను చేపట్టడంపై ద్వితీయ శ్రేణి నాయకులు,కేడర్ ను అయోమయం లో ముంచేస్తుంది.

ఇటీవల ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో లోక్ సభ అభ్యర్థుల విషయంపై రాష్ట్రా ఎన్నికల కమిటీ సభ్యులు డీకే అరుణ, మురళీధర్ రావు ,బండి సంజయ్,ఈటల రాజేందర్ ,గరికపాటి మోహన్రావు, జితేందర్ రెడ్డి సంస్థ గత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర రావు సమావేశం అయ్యారు. ఇందులో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల కోసం దరఖాస్తులను పరిశీలించగా…….ఇందులో మల్కాజిగిరి స్థానానికి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు నేతలు గ్రహించారు.

ఈ సీటు కోసం మాజీ మంత్రి ఈటల రాజేందర్ గట్టిగా పోటీ పడుతున్నారు.తనకున్న రాజకీయ అనుభవం,ప్రజాదరణ దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి టికెట్ తనకే ఇవ్వాలని అగ్రనేతలను కోరుతున్నట్లు తెలుస్తోంది.ఆయనతో పాటు ఇదే సీటును బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ఆశిస్తున్నారు. దశాబ్దాలుగా తనకున్న జాతీయస్థాయి అనుభవం, పార్టీతో తనకు ఉన్న అంకితభావం వంటి అంశాలు పరిగణలోకి తీసుకొని పోటీకి అవకాశం ఇవ్వాలని ఆయన అడుగుతున్నట్లు తెలుస్తుంది. వీరే కాకుండా మాజీ ఎంపీ చాలా సురేష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ,బిజెపి రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు హరీష్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి,కొంపల్లి మోహన్ రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కొమరయ్య,బీజేపీ అధికారి ప్రతినిధి తుళ్ళ వీరేంద్ర గౌడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నారు.దీంతో ఈ స్థానం లో ఎవరిని బరిలోకి దింపాలనేది బీజేపీ అధిష్టానానికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో జరుగుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • malkajgiri
  • TBJP
  • telangana

Related News

New Policy on Fee Reimbursement in Telangana

Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు ప్రక్రియలో కీలకమైన సంస్కరణలు చేపట్టింది. ఇకపై ట్యూషన్ ఫీజుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల పదో తరగతి మెమోలోని పేరు, ఇంటిపేరు వారి ఆధార్ కార్డులోని వివరాలతో కచ్చితంగా సరిపోలాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏమాత్రం తేడా ఉన్నా దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగదు. జాతీయ ఉపకార వేతనాల విధానానికి అనుగుణంగా

  • Cp Sumathi Secret Operation

    Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd