Balka Suman : జాతీయ పార్టీ దిశగా కేసీఆర్ అడుగులు, లీకులు ఇచ్చిన టీఆర్ఎస్ కీలక నేత..!!
నయా భారత్ దిశగా కేసీఆర్ అడుగులు పడాలన్నారు టీఆరెస్ ఎమ్మెల్యే బాల్కసుమన్.
- Author : hashtagu
Date : 09-09-2022 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
నయా భారత్ దిశగా కేసీఆర్ అడుగులు పడాలన్నారు టీఆరెస్ ఎమ్మెల్యే బాల్కసుమన్. బంగారు భారత్ కోసం కేసీఆర్ ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగారు భారత్ కోసం కేసీఆర్ వేసే ప్రతి అడుగులో టీఆరెస్ శ్రేణులు ఉంటాయాన్నారు. తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు దేశంలోనూ అమలు కావాలని కోరారు.
Also Read : ఏపీ సెంటిమెంట్ రాహుల్ కు కలిసి వస్తుందా..పాదయాత్ర అధికారానికి షాట్ కర్ట్ అవుతుందా
బంగారు భారత్ ఉద్యమం కోసం కేసీఆర్ మళ్లీ నడుం బిగించాలి. దేశాన్ని కాపాడుకోవడానికి…మేమంతా ఆయన వెంటే ఉంటామని ప్రకటించారు. బిజెపి ముక్త్ భారత్ కోసం కేసీఆర్ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ఏం కావాలో కేసీఆర్ కు చెబుతున్నా…మోదీ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోదీ దుర్మార్గపు పాలన దేశంలో నడుస్తోంది…మోదీ నాయకత్వంలో దేశంలో రాక్షసపాలన కొనసాగుతోందని విమర్శించారు.
కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లోకి రావాల్సిందే!#NationNeedsKCR #Telangana @trspartyonline @KTRTRS pic.twitter.com/RTDZytm6u9
— Balka Suman (@balkasumantrs) September 9, 2022